Kiccha Sudeep: బీజేపీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఆయనకు బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై కిచ్చా సుదీప్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Divya Bharti : 14ఏళ్లయినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని అందం
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
నివేదిక ప్రకారం కిచ్చ సుదీప్ మేనేజర్ జాక్ మంజుకి లేఖ వచ్చింది. ఈ లేఖలో సుదీప్ ప్రైవేట్ వీడియోలు విడుదల చేస్తామని బెదిరించారు. లేఖలో అవమానకరంగా, దర్భాషలాడారని తెలిపారు. ఈ విషయాన్ని సుదీప్ దృష్టికి తీసుకెళ్లినట్లు మేనేజర్ వెల్లడించారు. దీనిపై బెంగళూరులోని పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 120 బి, 506 మరియు 504 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచుకు బదిలీ చేయాలని సీనియర్ పోలీస్ అధికారులు యోచిస్తున్నారు.
కిచ్చా సుదీప్ తో పాటు మరో స్టార్ హీరో ఛాలెజింగ్ స్టార్ దర్శన్ కూడా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు బీజేపీలో చేరుతుండటం కన్నడ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వీరిద్దరు స్టార్ క్యాంపెనర్లుగా బీజేపీ తరుపున ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. ఏప్రిల్ 8న బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది.
తాజావార్తలు
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!