Kedarnath Dham: కేదార్ నాథ్ ధామ్ పోర్టల్ ను భక్తులందరకీ ఏప్రిల్ 25న తెరవనున్నట్లు అధికారులు ఈ రోజు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి ఈ కేధార్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. భక్తులు కాలినడకతో పాటు హెలికాప్టర్ ద్వారా కేదార్ నాథ్ ధామ్ చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించే యాత్రికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించనుంది.
Read Also: Durgam cheruvu: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నాలుగు రోజులు బంద్..!
రాబోయే చార్‌ధామ్ యాత్రను దృష్టిలో ఉంచుకుని మొత్తం 6.35 లక్షల మంది భక్తులు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ మార్చిలో తెలిపింది. వీరిలో కేదార్‌నాథ్ ధామ్‌కు 2.41 లక్షలు మరియు బద్రీనాథ్ ధామ్‌కు 2.01 లక్షలు, యమనోత్రికి 95,107 మరియు గంగోత్రి ధామ్‌కు 96,449 మంది భక్తులు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. చార్‌ధామ్ యాత్రలో ఆరోగ్య పరీక్షల కోసం హెల్త్ ఏటీఎం ఏర్పాటు చేస్తామని, భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.
ముందుగా మార్చి 11న రుద్ర ప్రయాగ్ జిల్లా యంత్రాంగం చార్ ధామ్ యాత్ర కోసం సన్నాహాలను ప్రారంభించింది. హిందువులు చార్ ధామ్ యాత్రను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. హిందూ ప్రముఖ తీర్థయాత్రలో ఇది ఒకటి. బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రిని కలిపి చార్ ధామ్ గా వ్యవహరిస్తారు. హిమాలయాల్లో ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు ఎఉన్నాయి. ప్రతి ఏడాది ఆరు నెలలు మంచుతో మూసేయబడే ఈ ప్రాంతాలు వేసవిలో ఏప్రిల్, మే నెలల్లో తిరిగి పున: ప్రారంభిస్తారు. అక్టోబర్ లేదా నవంబర్ లో మూసేస్తారు. ఏప్రిల్ 22న యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తెరవడంతో చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 25న కేదార్‌నాథ్, ఏప్రిల్ 27న బద్రీనాథ్ తెరుచుకోనున్నాయి.