Uddhav Thackeray: మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చుపెట్టాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఒక్క శివసేన కార్యకర్త కూడా లేరని ఆయన వ్యాఖ్యానించిన మరుసటి రోజు శివసేన(యూబీటీ)నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సీఎం ఏక్ నాథ్ షిండే రాజీనామా చేయాలని, లేకపోతే మంత్రి చంద్రకాంత్ పాటిల్ ను రాజీనామా చేయాలని కోరాలని అన్నారు. మసీదును కూల్చే సమయంలో ఎలుకలు వాటి బొరియల్లోనే దాక్కున్నాయని ఆయ బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. తమ పార్టీ హిందుత్వ ‘జాతీయ వాదం’ అని బీజేపీ దాని హిందుత్వ ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు.
Read Also: Monsoon: ఈ ఏడాది సాధారణ రుతుపవనాలే.. వెల్లడించిన ఐఎండి..
అయోధ్యలో డిసెంబర్ 6, 1992న బాబ్రీమసీదును కూల్చినప్పుడు భజరంగ్ దళ్, దుర్గా వాహిని కార్యకర్తలే ఉన్నారని మంత్రి చంద్రకాంత్ పాటిల్ సోమవారం అన్నారు. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ థాకరే వివాదాస్పద కట్టడం కూల్చివేతలో తన సైనికులు ఎవరైనా పాల్గొంటే తాను గర్వపడుతున్నానని అన్న మాటలను గుర్తు చేశారు.
బాల్ థాకరే వారసత్వాన్ని సీఎం ఏక్ నాథ్ షిండే దొంగిలించారని ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై చంద్రకాంత్ పాటిల్ మండిపడ్డారు. దింగతం శివసేన వ్యవస్థాపకులు బాల్ ఠాక్రే ఎవరి సొత్తు కాదని, ఆయన ప్రజల సొత్తు అని అన్నారు. బాలాసాహెబ్ హిందువులందరి ఆస్తి అని అన్నారు.