UP Rat Case: ఎలుకను నీటిలో ముంచి చంపిన వ్యక్తి.. 5 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Who Killed A Rat By Drowning Could Be Jailed For 5 Years: ఉత్తర్ ప్రదేశ్ బుదౌన్ లో ఓ ‘‘ఎలుక హత్య’’ కేసు చర్చనీయాంశంగా మారింది. ఎలుకకు రాయి కట్టి నీటిలో పడేసిన వ్యక్తిపై యూపీ పోటీసులు 30 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. వీటిని బుదౌన్ కోర్టులో మంగళవారం సమర్పించారు. ఎలుకకు సంబంధించి ఫోరెన్సిక్ వివారాలు, వివిధ సోర్సెస్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఛార్జిషీట్ సిద్ధం చేసినట్లు సీఐ అలోక్ మిశ్రా వెల్లడించారు. ఎలుకకు సంబంధించి ఊపిరితిత్తులు, కాలేయం ఇన్ఫెక్షన్ ఉందని, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరి ఆడక చనిపోయిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
మనోజ్ కుమార్ అనే వ్యక్తి గతేడాది నవంబర్ 25న ఎలుక పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందింది. కుమార్ ఎలుక తోకకు రాయిని కట్టి కాలువలో విసిరినట్లు జంతు కార్యకర్త వికేంద్ర శర్మ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలుకను కాపాడేందుక తాను కాలువలో దూకానని అయితే అది అప్పటికే చనిపోయినట్లు ఆయన పేర్కొన్నాడు. మంగళవారం సీనియర్ న్యాయవాది రాజీవ్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం కింద, రూ. 10 నుంచి రూ.2000 వరకు జరిమానా లేదా మూడేళ్లు జైలు శిక్ష, ఐపీసీ 429 ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
Read Also: Bombay High Court: “వైవాహిక వివాదాలు” మనదేశంలో తీవ్రమైన కేసులు..
అయితే మనోజ్ కుమార్ తండ్రి మధుర ప్రసాద్ మాత్రం ఎలుకలను, కాకులను చంపడం తప్పు కాదని, ఇది హానికరమైన ప్రాణులు అని అన్నారు. మట్టితో తయారు చేసిన పాత్రనలు ఎలుకలు పాడు చేస్తున్నాయని, దీంతో మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నా కొడుకుపై చర్యలు తీసుకుంటే మేకలు, కోళ్లును చంపే వారిపై కూడా చర్యలు తీసుకోవాలి, ఎలుకలను చంపే రసాయనాలను విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నవంబర్ లో జరిగిన ఈ సంఘటనలో మొదటగా ఎలుక మృతదేహాన్ని శవపరీక్ష కోసం బుడాన్‌లోని వెటర్నరీ ఆసుపత్రికి పంపారు. అయితే అక్కడి సిబ్బంది నిరాకరించడంతో మృతదేహాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ)కి పంపించారు. తర్వాత ఫోరెన్సిక్ పరీక్షలో ఎలుక ఊపిరితిత్తులు వాచిపోయి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయిందని తేలింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వల్ల ఊపిరి ఆడక ఎలుక చనిపోయిందని మా నిపుణులు నిర్ధారించారని ఐవీఆర్ఐ జాయింట్ డైరెక్టర్ కేసీ సింగ్ చెప్పారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!