Karnataka Elections: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తాజాగా ఈ రోజు బీజేపీ తన తొలివిడత అభ్యర్థులు జాబితాను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో తొలివిడతగా బీజేపీ 189 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలివిడతలో భారీగా ఎమ్మెల్యేలను తొలగించింది. ఏకంగా 52 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చింది. రెండో జాబితా త్వరలోనే వస్తుందని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. గత వారం చివర్లో బీజేపీ అగ్రనాయకులు జేపీ నడ్డా ఇంటిలో భేటీ అయి అభ్యర్థుల జాబితాను ఫైనలైజ్ చేశారు.
Read Also: UP Rat Case: ఎలుకను నీటిలో ముంచి చంపిన వ్యక్తి.. 5 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం..
ప్రస్తుతం కొత్తగా 52 మంది అభ్యర్థులకు అవకాశం ఇవ్వగా, 32 మంది ఓబీసీలకు, 20 మంది షెడ్యూల్ కులాలు(ఎస్సీ), 16 మంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నట్లుగా బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. తొమ్మిది మంది అభ్యర్థులు డాక్టర్లు కాగా, ఐదుగురు న్యాయవాదులు, ఇద్దరు రిటైర్డ్ అధికారులు, ఎనిమిది మంది మహిళలకు తొలి జాబితాలో చోటు దక్కింది. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు విడతలుగా తన అభ్యర్థులను ప్రకటించింది. జేడీయూ కూడా అభ్యర్థులను ప్రకటించింది. మరోసారి బీజేపీ కన్నడనాట అధికారంలోకి రావాలని భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తోంది.