Suicides rise significantly during the week of full Moon: భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడిని మనస్సుకు కారకుడిగా చెబుతుంటారు. చంద్రుడు మన ఆలోచల్ని ప్రభావితం చేస్తారని చెబుతుంటారు. ఇదిలా పక్కన పెడితే తాజాగా ఓ అధ్యయనంలో మాత్రం పౌర్ణమి సమయంలోనే అధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని తేలింది. డిస్కవర్ మెంటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఆత్మహత్యల ద్వారా మరణించే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. పౌర్ణమి రోజు ఆత్మహత్యలు పెరుగుతాయని మా అధ్యయనం తేలిందని, ఆ సమయంలో హై రిస్క్ ఉన్న పేషెంట్లను విశ్లేచించడం ద్వారా ఇది తెలుసుకున్నట్లు ఇండియానా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పిహెచ్‌డి అలెగ్జాండర్ నికులెస్కు పేర్కొన్నారు.
ఆత్మహత్యలు జరిగిన రోజు, నెలల సమయాలను పరిశోధకులు పరిశీలించారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో సెప్టెంబర్ నెలలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగినట్లు గుర్తించారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో ఆత్మహత్యలను పరిశీలిస్తే పౌర్ణమి సంభవించే వారంలోనే అధికం ఆత్మహత్యలు జరిగినట్లు తేలింది. ఆందోళన, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రేస్ డిజార్డర్, నొప్పి వంటి ఇతర మానసిక సమస్యలు కోసం ఈ పరిశోధన బృందం బ్లడ్ బయోమార్కర్ పరీక్షలను అభివృద్ధి చేసింది.
Read Also: Most Viewed Photo : ప్రపంచంలోనే ఎక్కువమంది చూసిన ఫోటో ఇదే..!
ఆత్మహత్యకు సంబంధించిన బయోమార్కర్లు పౌర్ణమి సమయంలో ఆత్మహత్య మరణాన్ని అంచనా వేస్తాయి. సహజంగా మానవశరీరంలో సిర్కాడియన్ గడియారం అని పిలువబడే ఇంటర్నల్ క్లాక్ ను కొన్ని జన్యువులు నియంత్రిస్తుంటాయి. ఈ వ్యవస్థ మానవ మెదడులోని హైపోథాలమస్ భాగంలో ఉంటుంది. ఈ అంతర్గత గడియారం మనం ఎంతసేపు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కోవాలనే విషయాలను నియంత్రిస్తుంది. శరీర సిర్కాడియన్ రిథమ్ పై కాంతి ప్రధాన పాత్ర పోషిస్తుందని, పౌర్ణమి సమయాల్లో చంద్రుడి కాంతి ఆత్మహత్యలను ప్రేరిపిస్తోందని పరిశోధకులు తెలిపారు.
అయితే చంద్రుడి కాంతి, ఆత్మహత్యలు, సిర్కాడియన్ గడియారం మధ్య సంబంధాలను మరింతగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అలెగ్జాండర్, అతని టీం చెప్పారు. కాంతిలో మార్పులు, ఇతర ప్రమాద కారకాలతో కలిసి వ్యక్తుల ఆలోచనను ప్రభావితం చేస్తాయని అన్నారు. ఆత్మహత్యలు ఎక్కువ జరిగే సమయం అని చెబుతున్న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు కాంతి తగ్గిన సందర్భంలో సిర్కాడియన్ క్లాక్ జన్యువులు ప్రభావితం అవుతున్నాయి, ఒత్తడికి సంబంధించిన కార్టిసాల్ హార్మోన్ తక్కువ అవుతున్నట్లు తేలింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి పగటి వెలుతురు తగ్గడం ప్రారంభిస్తే చాలా మంది ప్రజలు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ ను అనుభవిస్తారని పరిశోధకులు చెప్పారు. ముఖ్యంగా ఒత్తడి, ఆల్కాహాల్ వినియోగ రుగ్మతలు ఉన్న వ్యక్తుల్లో ఈ ఆత్మహత్య ఆలోచన ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.