Bombay High Court: వివాహ సంబంధ వివాదాల్లో పిల్లలను చరాస్థులుగా పరిగణిస్తున్నారని బాంబే హైకోర్టు మంగళవారం ఓ కేసులో వ్యాఖ్యానించింది. ఒక మహిళలను తన 15 ఏళ్ల కుమారుడితో థాయ్ లాండ్ నుంచి ఇండియాకు తిరిగిరావాలని ఆదేశించింది. పిల్లవాడు తన తండ్రి, తోబుట్టువులను కలుసుకోవచ్చని తీర్పు చెప్పింది. వైవాహిక వివాదాలు దేశంలో అత్యంత తీవ్రమైన కేసులని జస్టిస్ ఆర్డీ ధనుక, గౌరీ గాడ్సేలతో కూడిన బెంచ్ పేర్కొంది. పిల్లలపై తల్లిదండ్రుల హక్కుల కన్నా వారి సంక్షేమమే ముఖ్యమని పేర్కొంది.
థాయ్‌లాండ్‌లో తన తల్లితో కలిసి ఉంటున్న తన 15 ఏళ్ల కుమారుడిని కలవాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. విడిపోయిన తల్లిదండ్రుల కారణంగా బాలుడిపై తీవ్ర ప్రభావం పడుతుందని, తన తండ్రిని కలిసేందుకు పిల్లాడు ఆసక్తిగా ఉందని కోర్టు గమనించింది. మనదేశంలో వైవాహితక తగాదాలు అత్యంత తీవ్రంగా పోరాడే కేసులని, పిల్లలను ఆస్తులుగా పరిగనిస్తున్నారని పేర్కొంది. పిల్లల సంక్షేమం ప్రధానమైనదని, తల్లిదండ్రుల చట్టపరమైన హక్కులు కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
Read Also: Ram Charan: చరణ్ ఇంట్లో కుక్కలా పుట్టినా బావుండేది.. రైమ్ లక్కీ బేబీ
ఈ కేసులో విడిపోయిన జంటకు సంబంధించిన పెద్ద పిల్లలు ఒక కుమారుడు, కుమార్తె ఇద్దరు వారి తండ్రితోనే ఉంటున్నారు. సెప్టెంబర్ 2020లో కుటుంబ న్యాయస్థానం భార్య వద్ద ఉన్న బాలుడు తన తాతయ్యను, బాలుడి తోబుట్టువును కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. అయితే సదరు మహిళ వాటిని పాటించలేదని కేసు దాఖలు చేసిన ఆ వ్యక్తి పేర్కొన్నాడు. వేసవి సెలవుల్లో బాలుడిని ఇండియాకు తీసుకురావాలని మహిళను కోర్టు ఆదేశించింది.
అయితే సదరు మహిళ..తాను తన కొడుకుతో ఇండియాకు రావడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే వేసవి సెలువులు ముగిసిన తర్వాత థాయ్ లాండ్ తిరిగి వచ్చేలా అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని మహిళ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. బాలుడి ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, వాటిని గౌరవించడం అవసరం అని కోర్టు పేర్కొంది. తల్లిదండ్రులు అవసరాలు, పిల్లల సంక్షేమాన్ని సమతూకంగా పాటించాలని, పిల్లల అభిప్రాయాలను పరిగణించకపోతే అది వారి భవిష్యత్తుకు హానికరం అని హైకోర్టు పేర్కొంది.