JPMorgan: ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జేపీ మోర్గాన్ చేజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై తమ ఉద్యోగులు విధిగా ఆఫీసులకు రావాలని సూచించింది. వర్క్ ఫ్రంతో చాలని తెలిపింది. దీనికి సంబంధించి ఓ మోమోను విడుదల చేసింది. సీనియర్ ఉద్యోగులు, మేనేజింగ్ డైరెక్టర్లను వారానికి ఐదు రోజుల ఆఫీస్ నుంచి పనిచేయాలని హెచ్చరించింది. కోవిడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించిన పలు సంస్థలు ఇప్పుడు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని ఆదేశిస్తున్నాయి. దీంట్లో భాగంగానే జేపీ మోర్గాన్ కూడా తన కంపెనీ ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిందిగా కోరింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 2,94,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Read Also: Food Heritage: ఆ మాంసాన్ని నిషేధించిన ఇటలీ.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమాన
రిటర్న్-టూ-ఆఫీస్ నిబంధనలను పాటించడంలో ఎవరైనా ఉద్యోగులు విఫలం అయితే.. శిక్షిస్తామని గట్టిగా హెచ్చరించినట్లు ఫార్చ్యూన్ మ్యాగజైన్ వెల్లడించింది. కంపెనీ లీడ్ పొజిషన్లలో ఉన్న సిబ్బంది వారానికి 5 రోజులు ఆఫీసుల నుంచి పనిచేయాల్సిందే అని స్పష్టం చేసింది. మా కంపెనీని బలోపేతం చేయడం, ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని స్టాఫ్ మెమోలో బుధవారం పేర్కొంది. వారు ఆఫీసుల్లో కనిపించాలి, క్లయింట్లను కలవాలి అని, వారికి సలహాలు ఇవ్వాలి, ఆకస్మిక సమావేశాల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని మోమోలో తెలిపింది.
ట్రేడింగ్ లేదా సేల్స్ వంటి నిర్దిష్ట విభాగాలలో పనిచేసే నాన్-లీడర్‌షిప్ ఉద్యోగులు కూడా పూర్తి సమయం కార్యాలయంలో ఉండాలి. ఇతర సిబ్బంది వారానికి కనీసం మూడు రోజులు తప్పనిసరిగా హాజరు కావాలి, సూచించిన మెమో అనుసరించబడదు. హైబ్రీడ్ వర్క్ మోడ్ లో పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే అని, ఏదైనా మినహాయింపులు కావాలంటే సీనియర్ మేనేజ్మెంట్ ఆమోదం అవసరం అని, చాలా మంది ఉద్యోగులు కంపెనీ అంచనాలను అందుకోలేకపోతున్నారు, ఇది మారాలని హెచ్చరించింది. 2021లో జేపీ మోర్గాన్ ఇలాగే ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరింది. అయితే ఆ సమయంలో ఉద్యోగులు వ్యతిరేకించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో ఈ సారి ఉద్యోగులు కంపెనీలు చెప్పే నిబంధనలు పాటించేలా ఉన్నారు.