Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎంకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సమన్లు జారీ చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ముఖ్యమంత్రికి సమన్లు జారీ అయిన తర్వాత పలు విపక్షాలు ఆయనకు మద్దతుగా నిలబడుతున్నాయి. ఇదిలా ఉంటే సీబీఐ సమన్ల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చాడు. సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది.
CAPF constable exam: కేంద్ర సాయుధ పోలీస్ ఫోర్స్(CAPF) కానిస్టేబుల్ పరీక్షను హిందీ, ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర సాయుధ బలగాల్లో యువత ప్రాధాన్యతను పెంచడాని, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. CAPFలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP),…
Nitish Kumar: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రతిపక్షాల నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా కేజ్రీవాల్ కు అండగా నిలిచారు.
Plasma Waterfall: సూర్యుడు ప్రస్తుత తన 11 ఏళ్ల ‘‘సోలార్ సైకిల్’’ దశలో ఉన్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలంపై కల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సౌర జ్వాలలు, బ్లాక్ స్పాట్స్ వంటివి ఇటీవల కాలంలో ఏర్పడటం గమనించాం. ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడి ధ్రువాలు మారుతుంటాయి.
Flight Emergency Landing: జెడ్డా- హాంకాంగ్ కార్గో విమానం కోల్కతా ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. జెడ్డా నుంచి హాంకాంగ్ వెళ్తున్న సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం విండ్ షీల్డ్ కు పగుళ్లు రావడంతో అప్రమత్తం అయిన పైలెట్లు అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
Indians In Sudan Asked To Stay Indoors Amid Army-Paramilitary Clash: సూడాన్ మరోసారి సంక్షోభంలోకి వెళ్లింది. అక్కడ ఆర్మీ, పారా మిలిటరీ మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఇరు బలగాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి. సుడాన్ రాజధాన ఖార్టూమ్ కాల్పుల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది.
Matrimonial fraud: ఈ మధ్య మాట్రిమోనీ మోసాలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. బయట పెద్దలు కుదిర్చే సంబంధాలకు విలువే లేకుండా పోతోంది. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ అమ్మాయికి మంచి భర్తను తీసుకురావాలని భావిస్తూ ఈ మాట్రిమోనీ వెబ్ సైట్లపై ఆధారపడుతున్నారు. మంచి ఉద్యోగం, ఆస్తులు, కార్లు, విల్లాలు ఉన్న వ్యక్తుల్ని వెతికి మరీ పట్టుకుంటున్నారు. తమకు దగ్గరి బంధువుల నుంచి వచ్చే అబ్బాయిలను అసలు పట్టించుకోవడమే లేదు.
JioCinema: ఐపీఎల్ హక్కలను సొంతం చేసుకున్న తర్వాత జియో సినిమా చాలా మందికి దగ్గరైంది. అయితే ఇప్పుడు జియో సినిమాను అతిపెద్ద స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ గా మార్చేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్ లను తన జియో సినిమా యాప్ లోకి తీసుకురావాలని అనుకుంటోంది.
Uber: ప్రముఖ రైడ్-షేరింగ్ దిగ్గజం ఊబెర్ విచిత్రమైన ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. అయితే ఇది మన దేశంలో కాదు బెల్జియంలో. వినియోగదారుడి ఫోన్ లో తక్కువ ఛార్జింగ్ ఉన్న సమయంలో ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తుందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఉబెర్ వీటిని ఖండించింది. బెల్జియన్ వార్తా పత్రిక డెర్నియర్ హ్యూర్ లోని ఓ నివేదిక ప్రకారం... తక్కువ ఫోన్ బ్యాటరీ ఉన్న సమయంలో ఉబెర్ ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుందని ఆరోపించింది.
Rishab Shetty: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారతున్నాయి. ఇప్పటికే బీజేపీ తరుపున టికెట్లు దక్కని వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీకి మాత్రం కన్నడ స్టార్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సినీ నటి, రెబెల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత బీజేపీకి సపోర్టు ప్రకటించింది. ఇటీవల మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.