Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెమీహైస్పీడ్ రైలు. ఇప్పటికే 14 రూట్లలో వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లే విధంగా ఈ రైళ్లను తయారు చేశారు. అయితే ఇండియాలో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్స్ అంతవేగాన్ని తట్టుకునే అవకాశం లేకపోవడంతో 130 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు.
Atiq Ahmed: అతిక్ అహ్మద్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. గ్యాంగ్ స్టర్, మాఫియాడాన్, మాజీ ఎంపీ అయిన అతీక్ అహ్మద్ ను ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ మాఫియాను మట్టిలో కలిపేస్తా’ అని అన్నంత పనిచేశాడని అనుకుంటున్నారు సాధారణ ప్రజానీకం. అయితే ఎలాగూ జీవితఖైదు శిక్ష పడిన వ్యక్తిని, మరో హత్య కేసు ట్రయల్స్ జరుగున్న వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చిందనేది ఇక్కడ ప్రశ్నగా ఉంది. అయితే ఈ…
Same Gender Marriage: స్వలింగ వివాహాలలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ వచ్చిన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది. ఇలాంటి వివాహాలను కేంద్ర వ్యతిరేకించి తర్వాతి రోజే ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే దీనిపై కేంద్రం తన స్పష్టమైన వాదనని తెలియజేసింది.
Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ ఆ దేశ పార్లమెంటరీ విచారణను ఎదుర్కోబోతున్నారు. భార్య అక్షతా మూర్తికి సంబంధించిన వ్యాపారానికి ప్రయోజనం కలిగించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భార్య వ్యాపారానికి సహాయపడేలా ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశంపై విచారణ ఎదుర్కొనున్నారు. ప్రధాని నిబంధనలను ఉల్లంఘించారా..? లేదా..? అనే విషయాన్ని తేల్చేందుకు పార్లమెంటరీ కమిషనర్ ఫర్ స్టాండర్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ స్వతంత్ర అధికారి డేనియల్ గ్రీన్ బర్గ్ ఈ విచారణ బాధ్యతలను చేపట్టారు. ఒక వేళ రిషి సునాక్…
Trinamool's Mukul Roy Is "Missing", Claims Son: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్ మిస్సైనట్లు ఆయన కొడకు పేర్కొన్నాడు. సోమవారం సాయంత్రం నుంచి అతడి జాత లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మాజీ రైల్వే మినిస్టర్ అయిన ముకుల్ రాయ్ కుమారుడు సుభ్రాగ్షు సోమవారం సాయంత్రం మాట్లాడుతూ.. తన తండ్రి మిస్సైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు తన తండ్రిని కాంటాక్ట్ చేయలేకపోయానని, ఆయన జాడ తెలియడం లేదని అన్నారు. ముకుల్ రాయ్ సోమవారం సాయంత్ర ఢిల్లీకి వెళ్లాల్సి ఉందని ఆయన…
Uttar pradesh: దేశంలో అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో మైనర్లు ఈజీగా టార్గెట్ అవుతున్నారు. తాజాగా ఓ 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో హోంగార్డు నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.
Sudan Crisis: సైన్యం, పారామిలిటరీల మధ్య రాజుకున్న వివాదం సూడాన్ లో తీవ్ర హింసకు దారి తీసింది. ఈ రెండు బలగాల మధ్య తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. పారామిలిటరీని సైన్యంలో కలిపే ప్రతిపాదనతో సైన్యాధ్యక్షుడు, పారామిలిటీరీ కమాండర్ మధ్య వివాదం ఏర్పడింది. ఈ ఘర్షణల్లో 200 మంది మరణించగా.. 1800 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో సాధారణ ప్రజలు మరణిస్తున్నారు. మూడు రోజులుగా కొనసాతున్న ఈ ఘర్షణల్లో రాజధాని ఖార్టుమ్ లోని పలు ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. వైద్యం, ఆహారం కొరత ఏర్పడింది.
Pakistan: పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా నెమ్మదిగా ఆ దేశంలో తమ వ్యాపారాలను మూసేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి, ఉగ్రవాదం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై తరుచుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, పాక్ తాలిబాన్లు దాడులకు తెగబడుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో పనిచేసే చైనీయులు భయంతో పనులు చేస్తున్నారు. చివరకు చైనా తమ పౌరులు సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించిదంటే అక్కడ భద్రత ఏ విధంగా…
Decreasing use of debit cards: క్యాష్ లెస్ లావాదేవీల వైపు దేశం పరుగుపెడుతోంది. గతంలో పోలిస్తే కొన్నేళ్లుగా నగదు వినియోగం తగ్గిపోయి అంతా యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)కు అలవాటు పడ్డారు. రూపాయి దగ్గర నుంచి లక్షల వరకు లావాదేవీలన్నీ ఫోన్ పే, గూగుల్ పే ఇతర యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా జరుగుతున్నాయి. చివరు ఏటీఎంలలో కూడా నగదు తీసుకోవడానికి కార్డు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Amarnath Yatra: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రతీ హిందువు ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమూ ఆగస్టు 31 న ముగుస్తుందని జమ్మూ కాశ్మీర్ అధికారులు వెల్లడించారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్, గందర్బల్ జిల్లాలోని బల్తాల్ రెండు మార్గాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో రిజిస్ట్రేషన్ ప్రారంభించారు.