Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు నేటి నుంచి రిజిస్ట్రేషన్.. జూలై 1ను యాత్ర ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amarnath Yatra: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రతీ హిందువు ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుందని జమ్మూ కాశ్మీర్ అధికారులు వెల్లడించారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ రెండు మార్గాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో రిజిస్ట్రేషన్ ప్రారంభించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన 316 బ్రాంచ్‌లు, జె-కె 90 బ్రాంచ్‌లు, యెస్ బ్యాంక్ 37 బ్రాంచ్‌లు, ఎస్‌బిఐ బ్యాంక్ 99 బ్రాంచ్‌లతో సహా దేశవ్యాప్తంగా 542 బ్యాంక్ బ్రాంచ్‌లలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ లో కొత్త ఫీచర్ ను తీసుకువచ్చారు. ఆధార్ ఆధారిత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. దీని కోసం యాత్రికుల థంబ్ స్కాన్ చేస్తారు.
Also Read
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
- CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
Read Also: Pakistan: దైవదూషణలో చైనీయుడి అరెస్ట్.. మిత్రదేశం విషయంలో పాక్ ఏం చేస్తుందో చూడాలి..
ముమ్మర ఏర్పాట్లు..
నిబంధనల ప్రకారం 13-70 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తులు అమర్ నాథ్ యాత్ర కోసం నమోదు చేసుకోవచ్చు. అన్ని తీర్థయాత్రలు కోసం ఆరోగ్య ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. 6 వారాలు అంతకన్నా ఎక్కువ గర్భం ఉన్న స్త్రీలు యాత్రకు అనుమతించబడరు. మార్చి 14న జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ తీర్థయాత్రకు సంబంధించిన తేదీలను ప్రకటించారు. ఈ సారి ఎలాంటి అవాంతరాలు లేకుండా భక్తులకు అమరనాథుడిని సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టెలికాం సేవలు, ఆరోగ్య సేవలు, యాత్రీకులు ఉండటానికి బస, విద్యుత్, నీరు, భద్రతకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఉదయం మరియు సాయంత్రం ఆరతి (ప్రార్థనలు) ప్రత్యక్ష ప్రసారాలను కూడా ప్రారంభిస్తుంది. ఆన్లైన్ లో అనేక సేవలు పొందేందుకు ఈ సారి ప్రభుత్వం శ్రీ అమర్‌నాథ్‌జీ యాత్ర యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచింది.
హిమాలయాల్లో ఉన్న అమర్ నాథ్ క్షేత్రాన్ని శివుడి నివాసం అని నమ్మతారు. దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏలా లక్షల్లో భక్తులు వస్తుంటారు. అనంత్‌నాగ్ జిల్లాలో జిల్లా కేంద్రానికి 168 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 12,756 అడుగుల ఎత్తులో రాజధాని శ్రీనగర్ నుండి 141 కి.మీ దూరంలో ఉన్న గుఫా లాడార్ లోయలో ఉంది. సంవత్సరంలో చాలా భాగం ఈ క్షేత్రాన్ని మూసేస్తారు. వేసవిలో భక్తుల దర్శనానికి అనుమతిస్తుంటారు.
తాజావార్తలు
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
-
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
-
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
-
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!