Trinamool’s Mukul Roy Is “Missing”, Claims Son: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్ మిస్సైనట్లు ఆయన కొడకు పేర్కొన్నాడు. సోమవారం సాయంత్రం నుంచి అతడి జాత లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మాజీ రైల్వే మినిస్టర్ అయిన ముకుల్ రాయ్ కుమారుడు సుభ్రాగ్షు సోమవారం సాయంత్రం మాట్లాడుతూ.. తన తండ్రి మిస్సైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు తన తండ్రిని కాంటాక్ట్ చేయలేకపోయానని, ఆయన జాడ తెలియడం లేదని అన్నారు. ముకుల్ రాయ్ సోమవారం సాయంత్ర ఢిల్లీకి వెళ్లాల్సి ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు.
Read Also: YS Viveka Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ.. సీబీఐ ముందుకు వెళ్తారా?
ఢిల్లీ విమానాశ్రయంలో రాత్రి 9 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉందని మాకు తెలుసు, కానీ అతడి జాడ తెలియడం లేదని సన్నిహితులు తెలిపారు. టీఎంసీ పార్టీలో నెంబర్ 2 అయిన ముకుల్ రాయ్ పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా 2017లో బీజేపీలో చేరారు. ఆయన బెంగాల్ రాష్ట్రానికి బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత మళ్లీ టీఎంసీ గూటికి చేరారు.