Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ ఆ దేశ పార్లమెంటరీ విచారణను ఎదుర్కోబోతున్నారు. భార్య అక్షతా మూర్తికి సంబంధించిన వ్యాపారానికి ప్రయోజనం కలిగించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భార్య వ్యాపారానికి సహాయపడేలా ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశంపై విచారణ ఎదుర్కొనున్నారు. ప్రధాని నిబంధనలను ఉల్లంఘించారా..? లేదా..? అనే విషయాన్ని తేల్చేందుకు పార్లమెంటరీ కమిషనర్ ఫర్ స్టాండర్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ స్వతంత్ర అధికారి డేనియల్ గ్రీన్ బర్గ్ ఈ విచారణ బాధ్యతలను చేపట్టారు. ఒక వేళ రిషి సునాక్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలను ఉల్లంఘిస్తే సాక్ష్యాలు చూపించాల్సిన బాధ్యత అతనిపై ఉంది.
Read Also: Mukul Roy: తృణమూల్ నేత ముకుల్ రాయ్ మిస్సింగ్..
పిల్లల సంరక్షణకు సంబంధించి ‘కోరు కిడ్స్ లిమిటెడ్’ అనే సంస్థలో అక్షితకు వాటాలు ఉన్నాయి. గత నెలలో యూకే ప్రభుత్వం ప్రకటించిన ఓ పైలెట్ పథకం కింద ఇలాంటి సంస్థల నిర్వాహకులకు రాయితీలు అందుతాయి. అయితే ప్రధాని రిషి సునాక్ తన భార్య కంపెనీని దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకువచ్చారనే ఆరోపలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇన్ఫోసిక్ కంపెనీ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె అయిన అక్షతా మూర్తి యూకే ధనవంతుల్లో ఒకరిగా ఉన్నారు. గతంలో కూడా అక్షతా మూర్తిని అడ్డుపెట్టకుని రిషి సునాక్ ను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి.