Pakistan: పాకిస్తాన్ తో పాటు ఇతర ఇస్లామిక్ దేశాల్లో ‘‘దైవదూషణ’’కు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. మరణశిక్షలు విధించిన సందర్భాలు ఎక్కువ. పాకిస్తాన్ వంటి దేశాల్లో అయితే ఎలాంటి అనుమానం ఉన్నా కూడా దైవదూషణ వంటి కేసుల్లో మతోన్మాదులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జరిగాయి. 2021లో ఓ శ్రీలంక జాతీయుడిని దైవదూషణ పేరుతో ప్రజలే నిప్పంటించి కాల్చి చంపారు. దీని తర్వాత ఓ వ్యక్తిపై దాడి చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్ నే అటాక్ చేశారు.
Golden Temple: పంజాబ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల కాలంలో ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కారణంగా దేశవ్యాప్తంగా పంజాబ్ లోని పరిస్థితులు చర్చనీయాంశం అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో వివాదం ఇప్పుడు చోటు చేసుకుంది. అమృత్సర్లోని స్వర్ణదేవాలయంలోకి వెళ్లేందుకు ఓ అమ్మాయికి అనుమతి ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే ఆమె తన ముఖంపై భారతదేశ జాతీయ పతాకాన్ని కలిగి ఉండటమే. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Atiq Ahmed Murder: గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతీక్ అహ్మద్ హత్యపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. జ్యూడీషియల్ కమిటీ ద్వారా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిటీతో దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. 2017 నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన 183 ఎన్కౌంటర్లపై కమిటీ విచారణ జరిపించాలని పిటిషనర్ న్యాయవాది విశాల్ తివారీ కూడా కోరారు. ఇదే కాకుండా గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్పై కూడా…
Same-sex Marriage: కేంద్ర మరోసారి స్వలింగ వివాహాలను వ్యతిరేకించింది. ఈ వివాహాలకు చట్టపరమైన అనుమతిని మంజూరు చేయడాన్ని కేంద్రం ఈ రోజు మరోసారి వ్యతిరేకించింది. ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణించాలనేది ప్రతీ పౌరుడి ప్రయోజనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కేంద్రం పేర్కొంది.
Fertility Rate:ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. 19 శతాబ్ధంలో 100 కోట్ల మైలురాయిని చేరుకున్న ప్రపంచ జనాభా, గత 50 ఏళ్లలోనే రెట్టింపు అయింది. 1975 తర్వాతే సగం జనాభా పెరిగారు. దాదాపుగా 140 కోట్ల జనాభాతో భారత్ ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’కు చేరుకుంది. ఇదిలా ఉంటే సంతానోత్పత్తి రేటులో మాత్రం ఆఫ్రికా దేశాలు దూసుకుపోతున్నాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో సంతానోత్పత్తి రేటు క్షీణించగా.. ఆఫ్రికా దేశాల్లో మాత్రం ఇది ఎక్కువగా ఉంది
Covid 19: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజూవారీ కేసులు 10 వేలకు అటూఇటూగా నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,111 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.
Jagadish Shettar: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటకలో ప్రముఖ లింగాయత్ నాయకుడు, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2012 నుండి 2013 వరకు రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
Burkina Faso: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో దారుణం జరిగింది. జీహాదీలు జరిపిన దాడిలో 40 మంది మరణించారు. 33 మంది గాయపడ్డారు. శనివారం సాయంత్ర 4 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఉగ్రవాదులు సైనికులు, వాలింటరీలు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఉత్తర బుర్కినాఫాసోలోని ఓరేమా అనే గ్రామంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో 8 మంది సైనికులు ఉండగా.. 32 మంది డిఫెన్స్ వాలంటీర్లు ఉన్నట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సైన్యం జరిపిన వైమానికి దాడిలో 50 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపింది.
Jagadish Shettar: బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈ రోజు(సోమవారం) ఉదయం ఆయన బెంగళూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు.
Bathinda military station firing: పంజాబ్ భటిండా మిలిటరీ స్టేషన్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భటిండా పోలీసులు ఒక ఆర్మీ జవాన్ ను అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టును పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. దీనిపై పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.