Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, జేడీయూలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ, అధికారంలోకి రావాలని కాంగ్రెస్, కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జేడీఎస్ ఇలా ప్రతీపార్టీ కూడా తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలను అంతా సెమీఫైనల్ గా భావిస్తున్నారు.
2024 Lok Sabha elections: 2024 లోకసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలను ప్రారంభించింది. ఎలక్షన్ కమిషన్(ఈసీ) కొత్తగా 8.92 లక్షల కొత్త వీవీపాట్ మెషీన్లకు ఆర్డర్ చేసింది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMలు) తప్పుగా ఉన్నాయనే ఆందోళనలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
SCO Foreign Ministers Meeting: గోవాలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చే నెలలో తమ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు వస్తారని పాకిస్థాన్ గురువారం ప్రకటించింది. వచ్చే నెలలో 4-5 తేదీల్లో గోవా వేదికగా ఈ సమావేశం జరగబోతోంంది. దీనికి పాకిస్తాన్ తరుపును ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలో ప్రతినిధి బృందం భారత్ రానుంది. దాదాపుగా తొమ్మిదేళ్ల అనంతరం ఓ పాకిస్తాన్ నాయకుడు భారత్ లో పర్యటించడం…
Food Poisoning: జార్ఖండ్ రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పాడైన ‘‘ చాట్ మసాలా’’తిని 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ఈ రోజు తెలిపారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం కర్మతాండ్ పంచాయతీ పరిధిలో జరిగింది.
Anti-Hindu hate: బ్రిటన్ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకత పెరుగుతోందని ఓ నివేదిక పేర్కొంది. బ్రిటన్ పాఠశాలల్లో హిందూ విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నట్లు నివేదిక వెల్లడించింది. బ్రిటన్‌లోని పాఠశాలల్లో హిందూ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్ష మరియు బెదిరింపుల గురంచి లండన్ కు చెందిన హేడ్రీ జాక్సన్ సొసైటీ సర్వే నిర్వహించింది. నివేదిక 988 మంది హిందూ తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించింది. వీరిలో 51 శాతం మంది తమ పిల్లలు స్కూల్లలో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని, వివక్షను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
31 From Karnataka Stuck In Sudan: ఆఫ్రికా దేశం సూడాన్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి సైన్యం, పారామిటిలరీ మధ్య తీవ్రం ఘర్షణ ఏర్పడింది. ఈ రెండు దళాల అధిపతుల మధ్య తీవ్ర ఘర్షణ దేశాన్ని, అక్కడి ప్రజలు ప్రమాదంలోకి నెట్టింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. రాజధాని ఖార్టూమ్ లో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ఘర్షణల్లో 200 మంది మరణించాగా.. 1800 మంది గాయపడ్డారు. సూడాన్ లో పనిచేస్తున్న ఓ కేరళ వాసి…
NCP’s Ajit Pawar joining hands with BJP..?:మహరాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గతేడాది శివసేనను చీల్చి ఏకంగా ఏక్ నాథ్ షిండే బీజేపీ సహకారంలో సీఎం అయ్యారు. ఈ రాజకీయ వేడి చల్లారకముందు ఎన్సీపీ నేత అజిత్ పవార్, సీనియర్ లీడర్ శరద్ పవార్ కు షాకిచ్చేలా కనిపిస్తోంది.
Apple's First Store In India: టెక్ దిగ్గజం యాపిల్ తన మొదటి యాపిల్ స్టోర్ ను ముంబైలో ప్రారంభించింది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చేతుల మీదుగా స్టోర్ ప్రారంభం అయింది. భారతదేశంలో యాపిల్‌కి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్టోర్‌ను ప్రారంభించబడింది. టిమ్ కుక్ దగ్గరుండి మరీ కస్టమర్లను స్వాగతించారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఆపిల్ తన మొట్టమొదటి రిటైల్ స్టోర్ ను ప్రారంభించిన సందర్బంగా ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. చాలా మంది కస్టమర్లు మంగళవారం…
Supreme Court: గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ శనివారం రాత్రి హత్యకు గురయ్యారు. పోలీస్ కస్టడీలో వైద్యపరీక్షల నిమిత్తం వచ్చిన ఇద్దరిని ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టులుగా నటిస్తూ అతిదగ్గర నుంచి కాల్చి చంపారు. ఈ హత్య ఉత్తర్ ప్రదేశ్ తో పాటు యావత్ దేశంలో చర్చనీయాంశం అయింది. ప్రతిపక్షాలు సీఎం యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. యూపీ ఎన్కౌంటర్ రాజ్ గా మారిందని సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ వంటి పార్టీలు బీజేపీని…
NIA Probe Begins Into Attack On Indian Mission In London: ఖలిస్తానీ వేర్పాటువాదులు భారతదేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించిన సమయంలో ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో పలువరు ఖలిస్తాన్ వేర్పాటువాదులు భారత రాయబార కార్యాలయను టార్గెట్ చేశారు.