Uttam Kumar Reddy : బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖకు ‘చీకటి రోజులు’..
- పాలమూరు ఎత్తిపోతలపై బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి లేదన్న ఉత్తమ్
- కాళేశ్వరం పేరుతో వేల కోట్లు.. ఫలితం శూన్యం
- కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ఘోర వైఫల్యం
- మూడేళ్లలో ఎస్ఎల్బీసి పూర్తి చేస్తామని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంపై గత పదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని ఎండగడుతూ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలనే కనీస చిత్తశుద్ధి లేదని ఆయన ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో తమ వాటాగా ఉన్న 299 టీఎంసీల నీటిలో పాలమూరు-నల్గొండ జిల్లాల ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏనాడూ గట్టిగా డిమాండ్ చేయలేదని మండిపడ్డారు. పదేళ్ల సుదీర్ఘ పాలనలో బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయిందని, కానీ కాళేశ్వరం పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తే చివరికి మూడు బ్యారేజీలు కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు.
గత పాలకుల నిర్వాకం వల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏకంగా 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, కనీసం ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేకపోయారని మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు ఎంతో మంచి పేరు ఉండేదని, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టులను మార్చారని ఆరోపించారు. ఒక ట్రంక్ లైన్ వేసి, అందులో భారీగా లాభపడి, దానికే ఆహా ఓహో అంటూ సంబరాలు జరుపుకోవడం వారి స్థాయికి నిదర్శనమని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టినప్పుడు, వాటిని ఆపాలని కోరుతూ కేంద్రం అపెక్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తే, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సమావేశానికి హాజరుకాకపోవడం ఇరిగేషన్ శాఖ చరిత్రలోనే ఒక ‘చీకటి రోజు’ అని ఆయన అభివర్ణించారు.
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
Waste-to-Energy: వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ
బీఆర్ఎస్ వైఫల్యాలను గణాంకాలతో వివరిస్తూ, 2004 నుండి 2014 వరకు 715 టీఎంసీల కృష్ణా జలాలు బేసిన్ దాటి వెళ్తే, బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఏకంగా 1442 టీఎంసీల నీళ్లు బేసిన్ దాటి బయటకు వెళ్లిపోయాయని మంత్రి వెల్లడించారు. ఎస్ఎల్బీసి (SLBC) పనులను పదేళ్లలో పూర్తి చేయలేకపోయిన బీఆర్ఎస్, కోవిడ్ నెపం చెప్పడం హాస్యాస్పదమని, కోవిడ్ ఉన్నప్పుడు కాళేశ్వరం పనులు ఎలా పూర్తి చేశారని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోయాయని, వచ్చే మూడేళ్లలో ఎస్ఎల్బీసి పనులను పూర్తి చేస్తామని సభకు హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు చేస్తూ, బడ్జెట్ రిలీజ్ చేయగానే కమిషన్లు తీసుకునే అలవాటు తమకు లేదని, హరీష్ రావుకు ఉన్న పద్మాలయ స్టూడియో అలవాట్లు తమకు ఉండవని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఖర్చు చేస్తున్న ప్రతి పైసాకు లెక్క చెబుతామని, చరిత్రలో నిలిచిపోయేలా ఇరిగేషన్ శాఖను తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. తమ పదవీ కాలం ముగిసేలోపు పెండింగ్‌లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ నిబంధనల విషయంలో అప్పుడు బీఆర్ఎస్ పెట్టిన నిబంధనలే ఇప్పుడు తమకు వర్తిస్తాయని, నీళ్లు, పనులు ఆంధ్రకు ఇచ్చామని బీఆర్ఎస్ సభలు పెట్టి అబద్ధపు ప్రచారాలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
CP VC Sajjanar : తాగి డ్రైవింగ్ చేస్తే జైలుకే.. వారం రోజులు ‘స్పెషల్ డ్రైవ్’
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!