Uttar pradesh: దేశంలో అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో మైనర్లు ఈజీగా టార్గెట్ అవుతున్నారు. తాజాగా ఓ 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో హోంగార్డు నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.
Read Also: Sudan: సూడాన్‌లో తీవ్రమైన హింస.. 200 మంది మృతి..
వివరాల్లోకి వెళితే.. అన్న మొబైల్ పగలగొట్టినందుకు తల్లి తిట్టడంతో 12 ఏళ్ల బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చింది. మొబైల్ షాప్ లో రిపేర్ చేయించిన తర్వాత ఓ ఆటో రిక్షాలో ప్రయాణించింది. ఈ సమయంలో ఆటోలో ఉన్న ఓ నిందితుడు బాలికను హోంగార్డ్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నిందితులిద్దరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు.
జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సెక్షన్ 376 డి (గ్యాంగ్ రేప్), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఆదివారం రాత్రి నిందితులిద్దరిని అరెస్ట్ చేసినట్లు అదనపు పోలీస్ కమిషనర్ రజనీష్ ఉపాధ్యాయ్ సోమవారం వెల్లడించారు.