Atiq Ahmed: గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అతడితో పాటు ఆయన తమ్ముడు అష్రాఫ్ ను ముగ్గురు వ్యక్తులు, జర్నలిస్టులుగా నటిస్తూ అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వీరిని ప్రయాగ్ రాజ్ లో ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయి.
Beating Heart Diamond: వజ్రం.. ప్రపంచంలో అత్యంత అరుదైన వస్తువుల్లో ఒకటి. ఎన్నో ఏళ్లు భూగర్భంలో అధిక ఒత్తడి, పీడనానికి గురై వజ్రాలు తయారవుతుంటాయి. లాంటి వజ్రాలకు ప్రపంచంలో చాలా మార్కెట్ ఉంది. వజ్రాల రకాలు, దాని క్వాలిటీ, పరిమాణం వంటి వాటిపై దాని ధర ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా గుజరాత్ సూరల్ లోని వీడి గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి అత్యంత అరుదైన వజ్రం లభించింది. ఈ వజ్రం ప్రత్యేకత ఏంటంటే.. వజ్రంలో మరో వజ్రం ఇమిడి ఉంది. ఇది…
Illicit Relationship: ఆరుగురు మహిళా టీచర్లు విద్యార్థులతో లైంగిక సంబంధాలు నెరపడంతో అమెరికా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రెండు రోజలు వ్యవధిలో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలోని డాన్ విల్ కు చెంది ఎలెన్ షెల్(38) 16 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అర్కన్సాకు చెంది హెథర్ హరే(32) మరో టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నట్లు కేసు నమోదు అయింది.
Sudan: ఆఫ్రికా దేశం సూడాన్ లో అంతర్యుద్ధం ముదురుతోంది. సైన్యం, పారామిలిటరీ మధ్య తగాదాలు తారాస్థాయికి చేరాయి. సైన్యంలో పారామిలిటీరిన విలీనం చేసేందుకు సైన్యాధ్యక్షుడు ప్రతిపాదించడంతో, పారామిలిటీరి కమాండర్ దీనికి ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రహింస చెలరేగింది. రాజధాని ఖార్టూమ్ తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఘర్షణలు పాకాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సూడాన్ లోని భారతీయ రాయబార కార్యాలయం భారతీయులందరికి సూచనలు జారీ చేసింది. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.
Sacrifice Incident: గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య, భర్తలు తమ తలలను నరుక్కుని, తమను తాము బలి ఇచ్చుకున్నారు. ఇంట్లోనే గిలెటిన్ లాంటి పరికరాన్ని అమర్చుకుని తలలు తెగిపడేలా చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డరని పోలీసులు ఆదివారం వెల్లడించారు. మృతులు హేముభాయ్ మక్వానా (38), అతని భార్య హన్సాబెన్ (35) వింఛియా గ్రామంలోని తమ పొలంలో ఉన్న గుడిసెలో ఈ దారుణానికి ఒడిగట్టారు.
Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది. కారు అపమన్నందుకు, ఏకంగా ట్రాఫిక్ పోలీసును దాదాపుగా కారుపై 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన కారు విండ్ షీల్డ్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ ను 10 కిలోమీటర్లు తీసుకెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఘటన జరిగింది.
Dogs Attack: ఇటీవల దేశంలో చాలా ప్రాంతాల్లో కుక్కల దాడులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దాకా కుక్కల దాడులకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు వీటికి ఈజీగా టార్గెట్ అవుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో మార్నింగ్ వాక్ వెళ్లిన ఓ వ్యక్తిపై దాడి చేసి చనిపోయే వరకు కరిచి చంపాయి. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ విచారణ ముగిసింది. దాదాపుగా 9 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. సీఆర్పీసీ 161 కింద లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డ్ చేసుకున్నారు.
Minister Harish Rao: కర్ణాటక ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఎన్నికలను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి హరీష్ రావు కర్ణాటక ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాస్ట్రంలో తామంతా వెళ్లి ప్రచారం చేస్తామని అన్నారు. కర్ణాటకలో మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి…
MI vs KKR: ముంబై బ్యాటర్ల ముందు కోల్కతా నైట్ రైడర్స్ విధించిన లక్ష్యం చాలలేదు. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ మెరుపులతో కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ అద్భుత శతకం మరుగునపడింది. ఫలితంగా కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయిన 17.4 ఓవర్లలోనే ముంబై ఛేదించింది. ఇషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీనికి తోడు ఫామ్ లేక తంటాలు పడుతున్న సూర్య కుమార్ యాదవ్ మళ్లీ ఫామ్…