chhattisgarh: ఛత్తీస్గఢ్ లో ఓ వింత కేసు ఎదురైంది. తాను 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని హత్య చేశానని, అతను ఇప్పుడు కలలో వచ్చి హింసిస్తు్న్నాడంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బాలోద్ జిల్లాలో ఈ వార్త కలకలం రేపింది. సదరు వ్యక్తి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం, హత్యకు గురైన వ్యక్తిని పూడ్చి పెట్టిన స్థలం కోసం అధికారులు వెతుకులాట ప్రారంభించారు. బాలోద్ జిల్లాలోని కరక్భాట్ ప్రాంతానికి చెందిన టికం కొలియా అనే వ్యక్తి 2003లో ఛవేశ్వర్ గోయల్ అనే…
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కీలక ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఇన్స్టాగ్రామ్ కు సంబంధించిన కీలక నేతలను కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. పీటీఐ పార్టీ ఇన్స్టాగ్రామ్ హెడ్ అత్తౌర్ రెహ్మాన్ గురువారం తెల్లవారుజామున లాహోర్ నుండి కిడ్నాప్ కు గురయ్యాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పై వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన తర్వాత ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పోలీసుల సహకారంతో సోషల్ మీడియా వర్కర్స్, ముఖ్యంగా పీటీఐ…
Diabetes: కోవిడ్ ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నాయి. అయినా కూడా ప్రపంచంలో ఇంకా దాని ప్రభావం పూర్తిగా తగ్గలేదు. ప్రపంచంలో ఎక్కడో చోట కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. శ్వాససంబంధ ఇబ్బందులను ఎదుర్కుంటూనే ఉన్నారు. తాజాగా ఓ అధ్యయనం డయాబెటిస్ వ్యాధి కోవిడ్ తో ముడిపడి ఉన్నట్లు కనుగొంది.
Komatireddy Venkat Reddy: కేంద్ర రైల్వేశాక మంత్రి అశ్విని వైష్ణవ్ తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై గురించి చర్చించారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి స్టేషన్ కు ప్రతీరోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నారని, అదే విధంగా జనగామ జిల్లాగా ఏర్పడిందని, రోజూ విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారని ఈ రెండు స్టేషన్లను ఆధునీకీకరించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు.
Starship Super Heavy: ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన, అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలం అయింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ శక్తివంతమైన రాకెట్ ‘‘ స్టార్ షిప్ సూపర్ హెవీ’’ని ఈ రోజు ప్రయోగించింది. అయితే ఇది భూమి నుంచి ఆకాశంలోకి వెళ్లినా, కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆకాశంలోనే పేలిపోయింది. టెక్సాస్ లోని బోకా కికాలోని ఎలాన్ మస్క్ ఏరోస్పేస్ ఫెసిలిటి స్టార్ బేస్ నుంచి లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే పేలిపోయింది.
Bandi Sanjay: చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ లో ఈ భేటీ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 23న తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నియోజకవర్గ నేతలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుల ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ…
Karimnagar: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చును రేపుతున్నాయి. చివరకు ఆత్మహత్యలు, హత్యలకు కారణం అవుతున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న వారు పిల్లల జీవితాన్ని, తమ గౌరవాన్ని పట్టించుకోకుండా బరితెగిస్తున్నారు. భర్తలను కాదని ప్రియులతో సంబంధాలు నెరుపుతూ కొంతమంది భార్యలు హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అనేకం జరిగాయి. చాలా సందర్భాల్లో అక్రమ సంబంధాలు హత్యలకు కారణం అవుతున్నాయి.
Volodymyr Zelensky: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో అంతం అయ్యేలా కనిపించడం లేదు. రష్యా నెమ్మనెమ్మదిగా ఉక్రెయిన్ పై పట్టు సాధిస్తోంది. ఇప్పటికే అత్యంత కీలకం అయిన బఖ్ మూత్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే 70 శాతం ప్రాంతాన్ని రష్యా నియంత్రణలోకి తీసుకుంది. దీంతో పాటు మూడు వైపుల నుంచి భారీగా దాడులు చేస్తోంది. ఇటీవల రష్యా జరిపిన దాడుల్లో ఏకంగా 400 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి బఖ్ మూత్ సొంతం అయితే ఇక ఉక్రెయిన్ లోని…
Tata Altroz iCNG: ప్రతీ భారతీయులు ఓ కారు కొనాలంటే ముందుగా ఆలోచించేది ఖర్చు, అది ఇచ్చే మైలేజ్. అయితే ప్రస్తుతం ప్రముఖ కార్ తయారీ సంస్థలు ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తక్కువ ఖర్చులో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ వాహనాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ, టాటా వంటి దిగ్గజ కార్ మేకర్స్ సీఎన్జీ కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే మారుతీ…
26/11 Mumbai Terror Attacks: 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడిని అమెరికా, భారత్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా కోర్టు 30 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. 2008లో లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా వ్యక్తి తహవుర్ రాణా కీలక నిందితుడి ఉన్నాడు. ఇతడిపై అమెరికా న్యాయస్థానం విచారణ చేస్తోంది. ప్రస్తుతం జైలులో ఉన్న వ్యాపారవేత్త తహవుర్ రాణా దాఖలు చేసిన స్టేటస్ కాన్ఫరెన్స్ మోషన్ను అమెరికా న్యాయస్థానం కొట్టేసింది.