Zomato UPI: ప్రముఖ ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ యాప్ జొమాటో ఇకపై యూపీఐతో సేవలను అందించనుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. ఇకపై నేరుగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు ఇకపై గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ సపోర్ట్ లేకుండా నేరుగా జొమాటో నుంచే పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకోసం యూజర్లు ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు చాలా మంది యూపీఐ వాడుతున్నారని, అందుకే…
Monsoon: ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా అంటే జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. దీంతో జూన్-సెప్టెంబర్ నైరుతి రుతుపవన కాలంలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిసే అవకాశం 90 శాతం ఉందని తెలిపింది. గతంలో ఎల్ నీనో ఏర్పడిన పలు సందర్భాల్లో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదు […]
West Bengal: పశ్చిమ బెంగాల్లోని అక్రమ బాణసంచా తయారీ కర్మాగారంలో మంగళవారం జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కర్మాగారం పూర్తిగా ధ్వంసం అయింది. పేలుడు జరిగిన స్థలంలో చెల్లచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. పూర్బా మేదినీపూర్ లోని ఏగ్రాలో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు స్థానికుల్లో ఆగ్రహాన్ని పెంచింది. పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఘటన జరిగిన ప్రాంతం ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ పేలుడు సంభవించిన వెంటనే దాని యజమాని పారిపోయినట్లు పోలీసులు…
Nitin Gadkari: కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత నితిన్ గడ్కరీకి మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికార నివాసంలోని ల్యాండ్ లైన్ నంబర్ కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి గడ్కరీ కార్యాలయ సిబ్బందికి ఫోన్ వచ్చిందని, కాల్ చేసిన వ్యక్తి తన వివరాలను పంచుకోకుండా, మంత్రితో మాట్లాడాలని, అతనిని బెదిరించాలని చెప్పినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
Karnataka CM Post: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఎన్నాళ్ల నుంచో విజయాల కోసం మోహంవాచేలా ఎదురుచూస్తున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాల్లో 135 కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే గెలిచినా.. కాంగ్రెస్ పార్టీని సీఎం పోస్టు ఎవరికివ్వాలనే అంశం తలనొప్పిగా మారింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఇద్దరితో ఈ…
Jammu Kashmir: కాశ్మీరీ వేర్పాటువాది మార్వాయిజ్ మౌల్వీ మహ్మద్ ఫరూఖ్ హత్య జరిగిన 33 ఏళ్ల తరువాత, ఈ కేసులో ఇద్దరు హిబ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాదులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వీరి కొసం దశాబ్ధాలుగా దర్యాప్తు సంస్థలు, పోలీసులు వెతుకుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అరెస్ట్ చేసి వీరిద్దరిని సీబీఐకి అప్పగించినట్లు జమ్మూ కాశ్మీర్ సీఐడీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మీ రంజన్ స్వైన్ అన్నారు.
Jama Masjid: ఆగ్రాలోని జామా మసీద్ మెట్ల కింద పాతిపెట్టిన విగ్రహాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని హిందూ ట్రస్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీ కృష్ణ జన్మభూమి సంరక్షిత సేవా ట్రస్ట్ ఆగ్రాలోని జామా మసీదు మెట్ల క్రింద ఉన్న భగవాన్ కేశవదేవ్ విగ్రహాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ.. పిటిషన్ దాఖలు చేసింది.
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్ వైపు చూస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఏర్పడిని ఘర్షణ, భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ ను వదులుకునేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏ సంస్థ ఇష్టపడటం లేదు. ఇప్పుడున్న భారత ప్రభుత్వం, రానున్న రోజుల్లో చైనాకు ధీటుగా తయారీ రంగంలో భారత్ ను అగ్రగామిగా నిలిపేందుకు పనిచేస్తోంది. మరోవైపు చైనా, భారత సంబంధాలు కూడా చెప్పుకోదగిన రీతిలో లేవు. దీంతోనే భారత్ వైపు టెస్లా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది.
Recession: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఆర్థికమాంద్యాన్ని ఏదుర్కొవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వడ్డీరేట్లను పెంచుతోంది. ఇక బ్రిటన్ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ మాంద్యం గురించి హెచ్చరించింది.
Southwest Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కేరళలోకి ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఈ రోజు వెల్లడించింది. జూన్ 4 నాటికి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా వస్తాయని తెలిపింది. సాధారణంగా ఏడు రోజులకు అటుఇటుగా జూన్ 1 న కేరళలోకి ప్రవేశిస్తాయి.