China: చైనాలో మానవహక్కులకు పెద్దగా విలువ ఉండదు. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కానీ, ఆ దేశ నేతలను కానీ విమర్శిస్తే.. విమర్శించిన వారు తెల్లారేసరికే మాయం అవుతారు. వారి ఆచూకీ దశాబ్ధాలు గడిచిన కనిపించదు. అంతగా నిర్భందం ఉంటుంది అక్కడ. ఇక చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ గురించి చెప్పే పని లేదు. సరిహద్దు దేశాలతో ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంటుంది. అయితే చైనా ఆర్మీని మాత్రం విమర్శిస్తే అక్కడి పాలకులు ఊరుకోరు.
Kim Jong Un: ఉత్తర కొరయా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన కూతురుతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్ నార్త్ కొరియా అధినేతగా కిమ్ కూతరు ఉండబోతుందనే వార్తల నేపథ్యంలో ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో కిమ్ తన కూతురు ‘జూఏ’తో కలిసి క్షిపణి పరీక్షలు,
JP Nadda: ఉచితాలపై బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో జపాన్, అమెరికా, చైనా దేశాలు ఉచితాలపై డబ్బులను ఖర్చు పెట్టాయని, ఇదే ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి కారణం అయిందని అన్నారు. భారతదేశం మాత్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని.. ఇది మౌళిక సదుపాయాలు, వ్యవసాయం, ఇతర సెక్టార్లకు బూస్ట్ ఇచ్చిందని ఆయన అన్నారు.
Pakistan: పాకిస్తాన్ పరిస్థితి అస్సలు బాగా లేదు. అక్కడ ప్రభుత్వం, సైన్యం, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా ఆ దేశం బతికీడుస్తోంది. ఇది చాలదన్నట్లు ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం పాక్ ను మరింత కల్లోలానికి గురిచేస్తోంది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరువాత దేశ వ్యాప్తంగా ఆయన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ విడుదలైనా.. కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు.
Bihar: బీహార్ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. హిందూ యువకుడిపై ముస్లింలు దాడి చేశారు. ఇంతకీ అతను చేసిన తప్పు ముస్లిం యువతితో ఒకే బైక్ పై వెళ్లడమే. హిందూ యువకుడిని చితకబాదిన వీడియోలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడీయోలు వైరల్ గా మారడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ఆధారంగా పాట్నా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Karnataka: కర్ణాటకలో ఘన విజయం సాధించినా..కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి సతమతం అవుతోంది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో పాటు మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా పదవిని ఆశిస్తుండటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అయితే బుధవారం సీఎం ఎంపికపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ తో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ హామీ మేరకు డీకే శివకుమార్ మెత్తబడినట్లు సమాచారం.
Work From Home: కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం సంస్కృతి బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో ఈ తరహా పనికి ఉద్యోగులు అలవాటు పడ్డారు. ఆఫీసుకలు రమ్మని కంపెనీలు చెబుతున్నా.. కంపెనీలనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగారు ఉద్యోగులు. దీంతో హైబ్రీడ్ మోడ్ లో పనిచేయించుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే ఈ వర్క్ ఫ్రం హోం విధానంపై పలువురు కంపెనీల యజమానాలు పెదవి విరుస్తున్నారు.
Bihar: బీహార్ లో జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) నాయకుడు ఏర్పాటు చేసిన పార్టీ వివాదాస్పదం అయింది. జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ తన కార్యకర్తలకు మటన్ రైస్ తో విందు ఏర్పాటు చేశారు. ముంగేర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ నాయకుడు చేసిన విమర్శలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. జేడీయూ అధ్యక్షుడు విందు ఏర్పాటు చేసిన తర్వాత నుంచి ఆ ప్రాంతంలో వందలాది కుక్కలు కనిపించడం లేదని బీజేపీ ఆరోపించారు.
Junmoni Rabha: అస్సాంకు చెందిన వివాదాస్పద లేడీ పోలీస్ జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం తెల్లవారుజామున నాగావ్ జిల్లాలో కంటైనర్ ట్రక్కును ఆమె కారు ఢీకొడడంతో మరనించినట్లు అధికారు తెలిపారు. డేరింగ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ గా ‘‘లేడీ సింగం’’, ‘‘దబాంగ్ పోలీస్’’గా పేరు తెచ్చుకున్న ఆమె తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘనట జరిగింది. కలియాబోర్ సబ్ డివిజన్ పరిధిలోని జఖలబంధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభుగియా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Gautam Adani: గత నెల నేపాల్ లోని అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహిస్తూ ప్రమాదవశాత్తు పర్వతాల్లోని లోతైన పగుళ్లలో పడిపోయిన పర్వతారోహకుడు అనురాగ్ మాలూను ఖాట్మాండ్ నుంచి న్యూఢిల్లీ తరలించేందు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సహాయం చేశారు. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి ఢిల్లీకి తరలించారు. గాయపడిన తన తమ్ముడిని విమానంలో తరలించేందుకు సకాలంలో సాయం చేసిన గౌతమ్ అదానీకి అనురాగ్ మాలూ సోదరుడు ఆశిశ్ మాలూ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. Read Also: Zomato […]