Imran Khan: పాకిస్తాన్ ఆందోళనతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మే 9న అరెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు హింసాత్మక ఆందోళనకు దిగారు. అయితే పాక్ సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. ఇదిలా ఉంటే పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని, ఈ హింసాత్మక ఆందోళనకు కారణం అవుతోందని ఆయన విమర్శించారు.
BT Group: ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి సంస్థలు వేల సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో యూకే టెలికాం దిగ్గజ సంస్థ బీటీ గ్రూప్ చేరింది. ఏకంగా 55,000 మందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు 2030 నాటికి వరకు జరుగుతాయని వెల్లడించింది.
Warming World: భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఎక్కువ కావడంతో గత కొన్ని దశాబ్ధాలుగా భూగోళం ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తోంది. కర్భన ఉద్గారాల విడుదల కూడా ఇందుకు ఓ కారణం అవుతోంది. వేడిగా ఉండే దేశాలు మరింత వేడిగా మారుతున్నాయి. సమశీతోష్ణ దేశాలు ఊహించని విధంగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నాయి. ధృవాల వద్ద మంచు వేగంగా కరిగిపోతుంది. ఇదే జరిగితే కొన్నేళ్లలో సముద్రతీర ప్రాంతాల్లో ఉండే నగరాలు కనుమరుగు అవుతాయి.
Gujarat: సూరత్ లో దారుణం చోటు చేసుకుంది. తనకు పెళ్లైందనే విషయాన్ని దాచి పెట్టి వేరే మహిళతో సంబంధాన్ని కొనసాగిస్తున్న ఓ వ్యక్తి సదరు మహిళపై దారుణంగా వ్యవహరించాడు. మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆమె పట్ల పైశాచికంగా వ్యవహరించాడు. నిందితుడు మహిళ ప్రైవేట్ పార్ట్స్ లో మిరపకాయలను దూర్చి చిత్రవధ చేశారు. ప్రాణాలతో బయటపడిన సదరు మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలోొ చికిత్స పొందుతోంది..
Supreme Court: ఇటీవల కాలంలో భార్యభర్తలు చిన్నచిన్న విషయాలకే గొడవలు పడి విడాకులు కోరుతున్నారు. విడాకులు వివాదాలు గతంలో పోలిస్తే ప్రస్తుతం పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ రోజు సుప్రీంకోర్టు ప్రేమ వివాహాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకులు ప్రేమ వివాహాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ఓ జంట మధ్య విబేధాలకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
SP Hinduja: హిందూజా గ్రూప్ సంస్థల అధినేత శ్రీచంద్ పర్మానంద్ హిందూజా(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం లండన్ లో కన్నుమూశారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ.. జైలులో శిక్ష అనుభవిస్తున్న తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని కోరింది. ఇంతకీ ఎందుకంటే..తనకు సంతానం కావాలని,
Smoking Beedi On Flight: విమానంలో మొదటిసారిగా ప్రయాణిస్తున్న వ్యక్తి, నిబంధనలు తెలియక బీడీ తాగాడు. దీంతో అరెస్ట్ అయ్యాడు. అహ్మదాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న ఆకాశ ఎయిర్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ మార్వార్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి మంగళవారం అహ్మదాబాద్‌లో విమానం ఎక్కాడు. విమానం గాలిలో ఉండగా.. మరుగుదొడ్డికి వెళ్లిన అతను అక్కడ బీడీ తాగాడు.
DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో మంటలు పుట్టిస్తోంది. గత నాలుగు రోజుల నుంచి అధిష్టానం ఎన్ని చర్చలు జరిపినా సీఎం అభ్యర్థి ఖరారు కాలేదు. తాజా పరిణామాలను బట్టి చూస్తే దాదాపుగా సీఎం పీఠం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.
Karnataka Politics: కర్ణాటక రాజకీయ పరిణామాలు సగటు కాంగ్రెస్ అభిమానిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఫలితాలు వెలువడి మూడు రోజులు కావస్తున్నా.. కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తేల్చడం లేదు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య సీఎం పీఠం కోసం పోటీ నెలకొంది.