DK Shivakumar: కర్ణాటకలో భారీ విజయం నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై తర్జనభర్జన పడుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రేసులో ఉన్నారు. అ
Tamil Nadu: తమిళనాడులో విషాదం చోటు చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ ముగ్గురి ప్రాణాలు తీసింది. తమిళనాడు కడలూరులోని శ్రీముష్టం గ్రామ సమీపంలో కొత్తగా నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ పై ప్యాచ్ ఆప్ వర్క్ చేస్తున్న ముగ్గురు కార్మికులు విషవాయువులను పీల్చడం వల్ల చనిపోయారు.
Badruddin Ajmal: కర్ణాటకలో బీజేపీ పరాజయంతో 2024 ఎన్నికల్లో విపక్షాల కూటమి అనేది చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఓడించాలంటే విపక్షాల ఐక్యత ముఖ్యమని భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే అస్సాంకు చెందిన వివాదాస్పద నేత, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్, విపక్ష కూటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడేందుకు విపక్ష కూటమిలో చేరాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇదిలా ఉంటే గురువారం కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి, మంత్రి వర్గం ప్రమాణస్వీకారం ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అన్ని మిత్రపక్షాలకు ఆహ్వనాలు పంపించనుంది. కర్ణాటక మంత్రివర్గం ఒకటి రెండు రోజుల్లో ఖరారు అవుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Contact Lenses: కొన్ని రకాల కాంటాక్ట్ లెన్సుల్లో క్యాన్సర్ కు కారణమయ్యే కారకాలు ఉంటున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. యూఎస్ నుంచి వచ్చిన అనేక సాఫ్ట కాంటాక్ట్ లెన్సుల్లో ఎక్కువగా విషపూరితమైన, క్యాన్సర్కు కారణమయ్యే 'ఫరెవర్ కెమికల్స్'తో తయారయ్యాయని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 18 పాపులర్ రకాల కాంటాక్ట్ లెన్సులను పరీక్షించారు. ప్రతీదానిలో పాలీఫ్లోరో పాలీఫ్లోరోఅల్కైల్ పదార్ధం (PFA) మార్కర్ అయిన ఆర్గానిక్ ఫ్లోరిన్ అధిక స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు.
Kapil Sibal: కర్ణాటక అసెంబ్లీలో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇతర ఎన్డీయేతర ప్రతిపక్షాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాజ్యసభ ఎంపీ, మాజీ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సందేశం ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో ప్రజల మనుసులు గెలుచుకోవాలని కాంగ్రెస్ కు సూచించారు.
Mobile Phone tracking system: మీ ఫోన్ పోయిందని కంగారు పడుతున్నారా..? అయితే ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. ఈ వారంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రాకింగ్ సిస్టమ్ ఇకపై భారతదేశం అంతటా అమలులోకి రానుంది. పోయిన ఫోన్ని ట్రాక్ చేసి బ్లాక్ చేసేందుకు కొత్త సిస్టమ్ అందుబాటులోకి రాబోతోందని ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడించారు.
Fakes Kidnapping: ఇటీవల కాలంలో ఎగ్జామ్ రిజల్ట్స్ లో ఫెయిల్ అవుతామో అని, ఫెయిలైన తర్వాత పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అందుకు రివర్స్ లో ఉంది. అండర్ గ్యాడ్యుయేషన్ పరీక్షల్లో ఫెయిలైనందుకు ఏకంగా ఓ బాలిక కిడ్నాప్ డ్రామాకే తెరతీసింది. తల్లిదండ్రులు తిట్టకుండా ఉండాలని ఫేక్ కిడ్నాపింగ్ కు పాల్పడింది.
CBI: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్ ను నియమించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ టాప్ పోలీస్ ఆఫీసర్ రెండేళ్ల వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
Leopard Attack: గుజరాత్ రాష్ట్రాన్ని చిరుతపులుల దాడులు హడలెత్తిస్తున్నాయి. వరసగా మనుషులపై దాడులు చేస్తూ హతమార్చడమో, గాయపడటమో చేస్తున్నాయి. వారం వ్యవధిలో మూడు ఘటనలు జరగడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. అమ్రేలి జిల్లాలో రెండేళ్ల బాలుడిపై చిరుతపులి దాడి చేసి చంపింది. శనివారం అర్థరాత్రి రాజుల రేంజ్ ఫారెస్ట్ పరిధిలోని కాటర్ గ్రామంలోని ఓ గుడిసెలో కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారి నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.