Karnataka CM Post: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఎన్నాళ్ల నుంచో విజయాల కోసం మోహంవాచేలా ఎదురుచూస్తున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాల్లో 135 కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే గెలిచినా.. కాంగ్రెస్ పార్టీని సీఎం పోస్టు ఎవరికివ్వాలనే అంశం తలనొప్పిగా మారింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఇద్దరితో ఈ రోజు విడివిడిగా సమావేశం అయ్యారు.
Read Also: Naresh- Pavitra Lokesh: అబ్బో లైవ్ లోనే.. ముద్దులతో రెచ్చిపోయిన పవిత్ర-నరేష్
కర్ణాటక సీఎం పోస్టు సిద్ధరామయ్యనే వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపిస్తోంది. అయితే కొన్ని అంశాలు డీకే శివకుమార్ కు ప్రతిబంధకంగా మారినట్లు తెలుస్తోంది. ఆయనపై ఇప్పటికే ‘ఆదాయానికి మించిన ఆస్తుల’ కేసులు ఉన్నాయి. దీనికి తోడు కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్ ను కేంద్రం ఇటీవల సీబీఐ డైరెక్టర్ని చేసింది. డీకేకి, ప్రవీణ్ సూద్ కు గతం నుంచి పడటం లేదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో వస్తే డీజీపీపై చర్యలు తీసుకుంటామని డీకే కామెంట్స్ కూడా చేశారు.
రాజకీయంగా సిద్దరామయ్యకు క్లీన్ ఇమేజ్ ఉంది, అవినీతి రహితుడనే పేరుంది. వెనకబడిన వర్గం అయిన కురబ కమ్యూనిటికీ చెందిన సిద్దరామయ్యకు ఓబీసీల్లో క్రేజ్ ఉండటం కలిసి వస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో ఓబీసీల మద్దతుతో గెలిచామని మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సిద్దరామయ్యను వ్యతిరేకిస్తే తమ రాజకీయ మనుగడను ప్రశ్నార్థకం చేసుకుంటామనే ఆలోచన ఎమ్మెల్యేల్లో ఉంది. ఇదే సమయంలో డీకే శివకుమార్ కష్టపడిన విధానం వల్ల ఎమ్మెల్యేల్లో సానుభూతి కూడా ఉంది. మరోవైపు ప్రజలు మద్దతు కూడా సిద్దరామయ్యకే ఉండటం కూడా ఆయనకు ప్లస్ అవుతుంది.