Aadhaar Card: ఆధార్ కార్డ్.. ప్రస్తుతం భారతీయులకు ఎంతో ముఖ్యమైనది. భారతీయ పౌరులకు అందించే ప్రత్యేకమైన గుర్తింపు కార్డు. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ పథకాలు, పనులకు, చదువులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఆధార్ కార్డు లేనిదే ఏ జరగడం లేదంటే అతిశయోక్తి కాదు.
DK Shivakumar: కర్ణాటకలో ఎన్నికలలో 34 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. మెజారిటీ ఓట్లు, సీట్లను రాబట్టింది. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో ఏకంగా 135 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. అధికారంలో ఉండీ కూడా బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితం అయింది. కింగ్ మేకర్ అవుతామనుకున్న జేడీఎస్ కేవలం 19 స్థానాల్లో గెలిచింది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక విజయం మంచి బూస్ట్ ఇచ్చింది.
Amazon Layoff: అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, ఆర్థిక మాంద్యం భయాలు ఐటీ ఇండస్ట్రీతో పాటు సర్వీస్ సెక్టార్ ని భయపెడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించింది. గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా అనేక కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Delhi: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ కసాయి భర్త, భార్యాపిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశారు. చివరకు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈశాన్య ఢిల్లీ షాహదారా జిల్లాలోని జ్యోతి కాలనీలో ఈ ఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీ వినోద్ నగర్లోని ఢిల్లీ మెట్రో డిపోలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న సుశీల్ (45) వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
Karnataka Politics: కర్ణాటక సీఎం పదవి వ్యవహారం ఢిల్లీకి చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించినా.. సీఎం అభ్యర్థి ఎవరనేది తేలడం లేదు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరు కూడా సీఎం అభ్యర్థిత్వాన్ని కోరుకోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే సీఎం రేసులో మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. తమ నేతకే సీఎం పదవి కావాలని కాంగ్రెస్ లీడర్ జీ పరమేశ్వర అనుచరులు తుమకూరులో భారీ ర్యాలీ చేపట్టారు.
Uttar Pradesh: మానవ రూపాల్లో ఉన్న మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఎక్కడోచోట రోజుకు ఒక్కటైన ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అభంశుభం తెలియని చిన్నారులపై కూడా లైంగికదాడులకు తెగబడుతున్నారు. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా కూడా వాటికి భయపడకుండా, బరితెగించి ప్రవర్తిస్తున్నారు.
Karnataka: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఏకంగా 34 ఏళ్ల తరువాత భారీగా ఓట్లను, సీట్లను సంపాదించింది. మొత్తం 224 సీట్లలో 135 సీట్లను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే సీఎం అభ్యర్థిత్వం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందా..? అనేది సస్పెన్స్ గా మారింది.
Congress: కర్ణాటక ఎన్నికలు ముగిసినా.. కాంగ్రెస్ భారీ విజయం సాధించినా.. ఇప్పటికే సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆదివారం సాయంత్రం బెంగళూర్ లోని షాంగ్రీల్లా హోటల్ కేంద్రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ నేతలు జైరాంరమేష్, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్ పరిశీలకులుగా ఉన్నారు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ గెలుపుపై బీజేపీయేతర విపక్షాలు అభినందనలు తెలియజేస్తున్నారు. కొందరు విపక్షాల ఐక్యతకు ఇదే మంచి సమయం అని చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా అందులో చేరాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం ఈ విషయం దేశంపై ప్రభావం చూపించదని.. 2024 లోక్ సభ ఎన్నికలపై దీని ఎఫెక్ట్ ఉండదని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.
BJP: కర్ణాటక ఎన్నికల్లో కన్నడ ప్రజలు సంప్రదాయాన్ని కొనసాగించారు. దాదాపుగా గత మూడు దశాబ్ధాలుగా వరసగా ఏ పార్టీ కూడా రెండు సార్లు అధికారం ఏర్పాటు చేయలేదు. 1985 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. తాజాగా 2023 ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అయింది. బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో బీజేపీ 66 స్థానాలకు పరిమితం అయితే.. కాంగ్రెస్ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ 113ని దాటేసి 135 స్థానాల్లో గెలుపొందింది. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు…