Junmoni Rabha: అస్సాం మహిళా పోలీస్ అధికారి, ‘‘లేడీ సింగం’’గా పేరు తెచ్చుకున్న ఎస్ఐ జున్మోని రభా కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో ఆమె మరణించింది. అయితే ఆమె మరణం పట్ల కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Domestic Violence: మాజీ ప్రధాని మనవరాలికి కూడా గృహహింస, వరకట్న వేధింపులు తప్పడం లేదు. మాజీ ప్రధాని వీపీ సింగ్ మనవరాలైన అద్రిజా మంజరీ సింగ్ తాను గృహహింస ఎదుర్కొంటున్నట్లుగా డెహ్రాడూన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఆర్కేష్ నారాయణ్ సింగ్ డియోతో పాటు అతని తండ్రి, కుటుంబ సభ్యులపై డెహ్రడూన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదులో లభించిన శివలింగానికి శాస్త్రీయ సర్వే, కార్బన్ డేటింగ్ చేయడానికి మే 12న అలహాబాద్ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు శాస్త్రీయ సర్వేను వాయిదా వేయాలని తీర్పు చెప్పింది. ‘‘ఈ విషయంలో మనం జాగ్రత్తగా నడవాలి’’ అని కీలక వ్యాఖ్యలు చేసింది.
Brain Cancer: వైద్యరంగం ఇంతగా అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో కూడా క్యాన్సర్లకు పూర్తిగా చికిత్స లభించడం లేదు. అయితే వైద్యులు, పరిశోధకులు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త చికిత్సలను అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే బ్రయిన్ క్యాన్సర్ల విషయంలో ముందడుగు పడింది. అమెరికా కాలిఫోర్నియా విశ్వవిధ్యాలయంలోని శాన్ ఫ్రాన్సిస్కో మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తల బృందం కీలక విషయాన్ని కనుగొంది. ఈ టీంకు భారతీయ వైద్యురాలు సరితా కృష్ణ నేతృత్వం వహించారు.
Dog Beats Cancer: క్యాన్సర్ తో బాధపడుతున్న పోలీస్ జాగిలం, ఇప్పుడు దాన్నుంచి విముక్తి పొందింది. కాన్సర్ ని జయించి తిరిగి విధుల్లోకి చేరింది. లాబ్రాడార్ జాతికి చెందిన పోలీస్ జాగిలం పంజాబ్ పోలీస్ శాఖలో విధ్వంసక తనిఖీల్లో సహాపడుతుందని పోలీసులు తెలిపారు. సిమ్మీ అనే పేరున్న ఈ జాగిలం ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో 30-40 మంది వరకు టెర్రరిస్టులు ఉన్నట్లు పంజాబ్ ప్రభుత్వం, పంజాబ్ పోలీసులు ఆరోపించారు. వారందరిని అప్పగించాలని ఇమ్రాన్ ఖాన్ కు డెడ్ లైన్ కూడా ఇచ్చారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఇటీవల మీడియా ప్రతినిధులను తన ఇంటికి రమ్మని అంతా చూపించారు. పని మనుషులు తప్పితే ఎవరూ లేరని, తనపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నట్లు ఆరోపించారు.
Chandrayaan 3: అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరో రెండు నెలల్లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సమాయత్తం అవుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను ల్యాండ్ చేయడానికి అత్యంత క్లిష్టమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఈ ప్రయోగం జరగబోతోంది. చంద్రుడి రిగోలిత్ థర్మో ఫిజికల్ లక్షణాలను పరీశీలిచేందుకు, చంద్రుడిపై భూకంపాలు, చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా వాతావరణ పరిశీలించేందుకు సైన్స్ పరికరాలను చంద్రయాన్ -3 మిషన్ ద్వారా జాబిల్లి పైకి పంపనున్నారు.
New Parliament: కేంద్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ మే 28న ప్రారంభించనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం రోజు ప్రధాని నరేంద్రమోడీని కలిసి కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారు.
Siddaramaiah: సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు ప్రకటించింది. ఢిల్లీ నుంచి ఇద్దరు నేతలు ఈ రోజు సాయంత్రం బెంగళూర్ చేరుకున్నారు. బెంగళూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) మీటింగ్ నిర్వహించారు.
8 New Cities Across India: దేశంలో వేగంగా పట్టణీకరణ పెరుగుతోంది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న నగరాలు, పట్టణాలపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. పెరుగుతున్న పట్టణీకరణ, నగరీకరణ కారణంగా దేశంలో కొత్తగా 8 నగరాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. పట్టణ కేంద్రాలపై జనాభా భారాన్ని తగ్గించడానికి ఎనిమిది కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని సీనియర్ అధికారి గురువారం తెలిపారు. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని సిఫారసు చేసిందని…