8 New Cities Across India: దేశంలో వేగంగా పట్టణీకరణ పెరుగుతోంది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న నగరాలు, పట్టణాలపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. పెరుగుతున్న పట్టణీకరణ, నగరీకరణ కారణంగా దేశంలో కొత్తగా 8 నగరాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. పట్టణ కేంద్రాలపై జనాభా భారాన్ని తగ్గించడానికి ఎనిమిది కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని సీనియర్ అధికారి గురువారం తెలిపారు. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని సిఫారసు చేసిందని కేంద్ర గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖకు సంబంధించిన G20 యూనిట్ డైరెక్టర్ ఎంబీ సింగ్ తెలిపారు.
Read Also: Karnataka CM swearing: కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారం.. కేసీఆర్, మమతాతో సహా గెస్ట్ లిస్ట్ ఇదే..
ఇండోొర్ లో ‘అర్బన్ 20(U20)’ సమావేశం సందర్భంగా ఆయన మాట్టాడారు. ఆర్థిక సంఘం సిఫారసుల అనంతరం రాస్ట్రాలు 26 కొత్త నగరాల కోసం ప్రతిపాదన పంపాయని, పరిశీలన అనంతరం 8 కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని పరిశీలిస్తున్నామని చెప్పారు. కొత్త నగరాలను ఎక్కడ ఏర్పాటు చేస్తారు.. ఏ సమయంలోగా పూర్తవుతాయనే వివరాలను ప్రభుత్వం నిర్ణీత సమయంలో ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఉన్న నగరాలు పౌరుల అవసరాలను తీర్చలేక పోతున్నందున మనం దేశంలో కొత్త నగరాలను నిర్మించాలి, ప్రస్తుతం ఉన్న నగరాల్లో శివారు ప్రాంతాలు అస్తవ్యస్తంగా విస్తరించడంతో ప్రాథమిక ప్రణాళికను ప్రభావితం చేస్తోందని ఎంబీ సింగ్ అన్నారు. కొత్త నగరాల ఏర్పాటుకు సంబంధించి ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఖారారు కానప్పటికీ.. ఈ ప్రాజెక్టులో కేంద్రప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన వెల్లడించారు. కొత్త నగరాన్ని అభివృద్ధి చేస్తే కనీసం 200 కిలోమీటర్ల పరిధిలో సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు.