Brain Cancer: వైద్యరంగం ఇంతగా అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో కూడా క్యాన్సర్లకు పూర్తిగా చికిత్స లభించడం లేదు. అయితే వైద్యులు, పరిశోధకులు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త చికిత్సలను అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే బ్రయిన్ క్యాన్సర్ల విషయంలో ముందడుగు పడింది. అమెరికా కాలిఫోర్నియా విశ్వవిధ్యాలయంలోని శాన్ ఫ్రాన్సిస్కో మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తల బృందం కీలక విషయాన్ని కనుగొంది. ఈ టీంకు భారతీయ వైద్యురాలు సరితా కృష్ణ నేతృత్వం వహించారు.
బ్రెయిన్ క్యాన్సర్ల విషయంలో క్యాన్సర్ కణాలు, ఆరోగ్యవంతమైన మెదడు కణాలతో కలిసి హైపరాక్టీవ్ గా మారుతున్నాయని కనుగొన్నారు. ఇది రోగుల మరణాలకు కారణం అవుతోందని, వాటి పెరుగుదలను ఆపడంలో సాధారణంగా ఉపయోగించే యాంటీ-సీజర్ డ్రగ్ ప్రభావవంతంగా ఉందని సరితా కృష్ట టీం కనుగొంది. ఈ అధ్యయనం సైన్స్ జర్నల్ “నేచర్”లో ప్రచురించబడింది. ఆరోగ్యకరమైన మెదడు కణాలు, క్యాన్సర్ కణాల మధ్య కమ్యూనికేషన్, కణితి పెరుగుదలను నెమ్మదించడం, ఆపడం కూడా చేయవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అత్యంత ప్రమాదకరమైన ‘ గ్లియోబ్లాస్టోమా’ మెదడు క్యాన్సర్ ఉన్న రోగులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది.
Read Also: Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచై ఇల్లునే కొనుగోలు చేసిన నటుడు.. ఎవరో తెలుసా..?
మెదడు కణితులు హైజాక్ చేసి మెదడు సర్క్యూట్రీని సవరించడం ద్వారా గ్లియోమా రోగుల్లో మతిమరుపు, బ్రెయిన్ పనితీరు నెమ్మదించడానికి కారణం అవుతుందని సరితా కృష్ణ, శాస్త్రవేత్త షాన్ హెర్వే జంపర్ నిర్వహించిన అధ్యయనంలో కనుగొన్నారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన సరితా మాట్లాడుతూ.. రోగులను స్పృహలో ఉంచి మెదడు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో, లాంగ్వేజ్ టాస్క్ ఇచ్చినప్పుడు మెదడులోని లాంగ్వేజ్ ఏరియాలతో పాటు ఈ ప్రాంతానికి దూరంగా ఉండీ, క్యాన్సర్ సెల్స్ ఉన్న మెదడు ప్రాంతాల్లో కూడా క్రియాశీలతను కనుగొన్నామని తెలిపారు. ఇది ప్రాణాంతక క్యాన్సర్ కణాలు చుట్టు పక్కల మెదడు కణజాలంలో కనెక్షన్లను కూడా హైజాక్ చేయగలవని, వాటిని హైపరాక్టివ్ గా మార్చగలవని, రోగి బతికే కాలాన్ని తగ్గించగలవని చూపించిందని తెలిపారు.
ఈ ప్రయోగంలో నూరానల్ హైపెరెక్సిబిలిటీలో ‘థ్రోంబోస్పాండిన-1’ అనే ప్రొటీన్ కీలక పాత్రను వెల్లడించింది. సాధారణంగా ఉపయోగించే యాంటీ-సీజర్ ఔషధం అయిన గబాపెంటి, న్యూరోనల్ హూపెరెక్సిబిలిటీని విజయవంతంగా తగ్గించిందని, కణితి పెరుగుదలను నిలిపివేసిందని అధ్యయనం పేర్కొంది. గ్లియోబ్లాస్టోమా వంటి చాలా ప్రాణాంతక వ్యాధికి మరింత ప్రభావవంతమైన చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేయడంలో ఈ ఆవిష్కరణ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అంతేకాకుండా, క్యాన్సర్ కణం ద్వారా మెదడు సర్క్యూట్రీని హైజాక్ చేయడం గురించి కీలక ఆవిష్కరణ, కణితి పెరుగుదలను ఆపడానికి మెదడు క్యాన్సర్ కణాలతో న్యూరోనల్ లింకప్‌లను డిస్‌కనెక్ట్ చేయగల మందులు, న్యూరోమోడ్యులేషన్ పద్ధతుల అభివృద్ధికి దారి తీస్తుందని సరితా తెలిపారు.ఎపిలెప్సీ మరియు సైకియాట్రిక్ వ్యాధులలో న్యూరానల్ పనితీరును మాడ్యులేట్ చేయడానికి సాంప్రదాయకంగా వర్తించే నాన్-ఇన్వాసివ్ బ్రెయిన్ మాడ్యులేషన్ టెక్నిక్‌లను ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగించుకోవచ్చని, గ్లియోమా కార్యకలాపాలను అణిచివేసేందుకు మెదడు క్యాన్సర్ ఉన్న రోగులలో పరీక్షించవచ్చని చెప్పారు.