Chandrayaan 3: అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరో రెండు నెలల్లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సమాయత్తం అవుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను ల్యాండ్ చేయడానికి అత్యంత క్లిష్టమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఈ ప్రయోగం జరగబోతోంది. చంద్రుడి రిగోలిత్ థర్మో ఫిజికల్ లక్షణాలను పరీశీలిచేందుకు, చంద్రుడిపై భూకంపాలు, చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా వాతావరణ పరిశీలించేందుకు సైన్స్ పరికరాలను చంద్రయాన్ -3 మిషన్ ద్వారా జాబిల్లి పైకి పంపనున్నారు.
చంద్రయాన్-3 మిషన్ జూలై రెండవ వారంలో షెడ్యూల్ చేయబడిందని ఇస్రో సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా ల్యాండర్, రోవర్ రెండింటిని చంద్రుడిపైకి పంపనున్నారు. చంద్ర కక్ష్య నుండి భూమి యొక్క స్పెక్ట్రో పొలారిమెట్రిక్ సిగ్నేచర్ ని ఈ మిషన్ ద్వారా అధ్యయనం చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో ఎదురయ్యే కఠినమైన కంపనాలు, ధ్వని వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని శాస్త్రవేత్లుల విజయవంతంగా పూర్తి చేశారు.
Read Also: New Parliament: మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని
శ్రీహరికోటలోని షార్ నుంచి ఎల్వీఎం3(లాంచ్ వెహికల్ మార్క్-3)( గతంలో దీన్ని జీఎస్ఎల్వీ మార్క్-3గా పిలిచేవారు) ద్వారా చంద్రయాన్-3ని ప్రయోగించనున్నారు. ఇది ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ అనే మూడు మాడ్యుళ్లను కలిగి ఉంటుంది. చంద్రయాన్-2 మిషన్ కు కొనసాగింపుగా చంద్రయాన్-3ని చేపడుతున్నారు. లాంచ్ వెహికిల్ చంద్రుడి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్య వరకు ల్యాండర్ మాడ్యుల్ ని తీసుకెళ్తుంది. ఆ తరువాత దశల వారిగా ల్యాండర్, రోవల్ చంద్రుడి ఉపరితలంపై దిగుతాయి.
ప్రొపల్షన్ మాడ్యూల్, స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్‌ను ల్యాండర్, రోవర్ కాన్పిగరేషన్ ను 100 కిలోమీటర్ల చంద్ర కక్ష్యవరకు తీసుకెళ్తుంది. థర్మల్ కండక్టివటీ, ఉష్ణోగ్రత, చంద్రుడిపై భూకంపాల యాక్టవిటీని అధ్యయనం చేయడానికి అవసరమైన పేలోడ్ ను ల్యాండర్ కలిగి ఉంటుంది. రోవర్ ల్యాండింగ్ సైట్ లో మూలకాలను అధ్యయనం చేయడానికి ‘ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్’ మరియు ‘లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ’ పరికరాలను కలిగి ఉంటుంది.