G20 Meeting: జమ్మూ కాశ్మీర్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ కు వంత పాడుతోంది చైనా. మరోసారి భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. పర్యాటక రంగంపై జీ 20 వర్కింగ్ గ్రూప్ మూడో సదస్సు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిర్వహించాడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. శ్రీనగర్ లో ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజలు పాటు సభ్యదేశాలతో సమావేశం జరుగనుంది.
Deep Sleep: నిద్ర అనేది మానవ శరీరానికి చాలా అవసరం. మన దినచర్యలో భాగం. నిద్ర మన శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితుల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. శరీరం నిద్రలో ఉన్నప్పుడు కూడా మెదడు చురుకుగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. ఇదిలా ఉంటే గాఢ నిద్ర తగ్గే కొద్ది పక్షవాతం, అల్జీమర్స్ వ్యాధితో పాటు మతిమరుపు సమస్యలు పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ యొక్క మెడికల్ జర్నల్ అయిన న్యూరాలజీలో ఈ కొత్త పరిశోధన ప్రచురించబడింది.
Congress: రూ. 2000 నోట్ల రద్దును ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. ఈ చర్య ‘‘స్వయం శైలి విశ్వగురువు’’, ‘‘ఫస్ట్ యాక్ట్, సెకండ్ థింక్’’( మొదట చేసి, తర్వాత ఆలోచించడం)
RBI website crash: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వెల్లడించిన కొద్ది సేపటికే ఆర్బీఐ అధికార వెబ్సైట్ క్రాష్ అయింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఆర్బీఐ అధికారిక వెబ్
Rs 2,000 Note Withdrawn: బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ పలు విషయాల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని సగటు భారతీయుడు భావిస్తున్న కాలం అది. సరిగ్గా అటువంటి సమయంలోనే నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిచారు. ఆ రోజు అర్థరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. నల్లధనం అదుపు చేయడంతో పాటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆర్థిక నిధులు అందకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం…
Meta Layoffs: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలను వణికిస్తున్నాయి. ఇప్పటికే మెటా, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటా తన ఆర్థిక పనితీరును మెరుగుపరుచుకోవడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో 2023ని ‘‘ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ’’గా ప్రకటించింది.
Rs. 2000 Notes withdrawn: రూ. 2000 నోట్లను ఉపసంహరించుకన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2,000 నోట్లను సర్క్యులేషన్ లో ఉంచొద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది.
PM Modi: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం తర్వాత నుంచి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్, భారత్ లో వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసుకుంది. అయితే దీని ఫలితాలను పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Anand Mahindra: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎల్లప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. పలు సమకాలీక అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా ఓ కుటుంబం కారు కొన్న ఆనందంలో డ్యాన్స్ చేయడంపై ఆయన స్పందించారు. ముఖ్యంగా ఇండియాలో వాహనం కొనుగులు చేయడం చాలా ప్రత్యేకంగా భావిస్తుంటారు. దాన్ని ఓ వాహనంలా కాకుండా కుటుంబంలో సభ్యుడిగా భావిస్తుంటారు. అలాంటిది ఓ కొత్త కారు కొంటే సదరు కుటుంబం ఆనందాలకు అవధులు ఉండవు.
PM Modi: హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడమే కాకుండా, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో సహా అనేక మంది ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలిడిమిర్ జెలన్ స్కీతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య సమావేశానికి సంబంధించి ఇరు దేశాల దౌత్యవేత్తల మాట్లాడుతున్నట్లు సమాచారం.