Maharashtra: మహారాష్ట్రలో మరో రాజకీయ సంక్షోభం రాబోతోందా..? అంటే శివసేన( ఉద్ధవ్) పార్టీ మౌత్ పీస్ పత్రిక అయిన ‘సామ్నా’ ఔననే అంటోంది. ఉద్దవ్ వర్గానికి మద్దతుగా సామ్నా పత్రిక కొన్ని కీలక విషయాలను పేర్కొంది. ప్రస్తుతం సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని,
Jio Cinema: జియో సినిమా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను బిలియనీర్, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా దక్కించుకుంది. ఫ్రీగా చూసే అవకాశం ఇవ్వడంతో జియో సినిమా డౌన్ లోడ్స్, వ్యూయర్ షిప్ బాగా పెరిగింది.
Bank Holidays In June: జూన్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రాబోతున్నాయి. ఏకంగా 12 రోజలు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జూన్ నెలలో బ్యాంకులు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో జూన్ నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.
Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అయితే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మాత్రం తారాస్థాయికి చేరుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు మాత్రం సమసిపోవడం లేదు. స్వపక్షంలోనే ఉంటూ విపక్షాల్లా విమర్శించుకుంటున్నారు.
Kerala: మటన్ తక్కువగా వడ్డీస్తున్నారని చెబుతూ ఏకంగా ఓ ఖైదీ జైలు అధికారులపైనే దాడి చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. తనకు వడ్డించిన మటన్ కర్రీతో సంతృప్తి చెందకపోవడంతో వయనాడ్ కు చెందిన ఖైదీ ఫైజాస్ పూజపురా సెంట్రల్ జైలులో అధికారులపై దాడికి పాల్పడ్డాడు. డ్రగ్స్ కేసులో దోషిగా తేలిన ఇతడిని ప్రస్తుతం జైలులో అత్యంత భద్రతతో కూడిన సెల్ లో ఉంచారు.
Farming with alcohol: మద్యం ఆరోగ్యానికి హానికరం, అతిగా తాగితే పైకిపోవడమే. అయితే మద్యం పంటకలు మంచిదే అంటున్నారు మధ్యప్రదేశ్ రైతులు. పంటల్లో చీడపీడలను అరికట్టేందుకు దేశీ లిక్కర్ వాడుతున్నారు. దీంతో ఫలితాలు బాగుంటున్నాయని చెబుతున్నారు. పెరుగుతున్న పురుగుమందుల ధరలకు ఇది పరిష్కారం అంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదాపురం జిల్లా రైతులు ఇలా వినూత్నంగా వ్యవసాయం చేస్తూ.. చర్చనీయాంశంగా మారారు.
UpComing SUVs:భారతదేశ ఆటోమార్కెట్లో ప్రస్తుతం ఎస్యూవీ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. హ్యాచ్ బ్యాక్, సెడాన్ కార్ల కన్నా కూడా కాంపాక్ట్ ఎస్యూవీలు, ఎస్యూవీల అమ్మకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ ఆటోమేకర్స్ కూడా కొత్త ఎస్యూవీ కార్లను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. వచ్చే కొన్ని నెలల్లో వివిధ కంపెనీల నుంచి 5 ఎస్యూవీ కార్లు లాంచ్ కాబోతున్నాయి.
BGMI: నిషేధిత పబ్జీ గేమ్ తర్వాత అంతగా క్రేజ్ తెచ్చుకున్న గేమ్ ఏదైనా ఉందంటే అది BGMI. మల్టీ ప్లేయర్ గేమ్ అయిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) భారత్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది.
Congress: కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని దారుణంగా ఓడించామని సంబర పడుతున్న కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం ఎదురుదెబ్బ తాకింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందాడు. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పార్టీలో చేరాడు. దీంతో బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ సోమవారం టీఎంసీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేారారు.
Cannes 2023: ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిపోవాలని యావత్ ప్రపంచ సినీఆర్టిస్టులు, మోడల్స్ అనుకుంటారు. అందుకు తగ్గట్లుగానే తన డ్రెస్సింగ్ అదరగొడుతుంటారు. తలతిప్పలేని అందాకలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇది రాజకీయ నిరసనలకు, పలు దేశాలు అవలంభిస్తున్న దమననీతిని ఖండించే వేదికగా మారింది.