Farming with alcohol: మద్యం ఆరోగ్యానికి హానికరం, అతిగా తాగితే పైకిపోవడమే. అయితే మద్యం పంటకలు మంచిదే అంటున్నారు మధ్యప్రదేశ్ రైతులు. పంటల్లో చీడపీడలను అరికట్టేందుకు దేశీ లిక్కర్ వాడుతున్నారు. దీంతో ఫలితాలు బాగుంటున్నాయని చెబుతున్నారు. పెరుగుతున్న పురుగుమందుల ధరలకు ఇది పరిష్కారం అంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదాపురం జిల్లా రైతులు ఇలా వినూత్నంగా వ్యవసాయం చేస్తూ.. చర్చనీయాంశంగా మారారు.
Read Also: Kriti Kharbanda : శృతి మించిన కృతి.. ఆందాల ఆరబోత కాదు పారబోతే
పెసర వంటి పప్పు ధాన్యాలతో పాటు పసుపు పంటకు ఇలా దేశీ లిక్కర్ ను పిచికారీ చేస్తున్నారు. చాలా మంది రైతులు 100 మిల్లీమీటర్లు దేశీ మద్యాన్ని 15 లీటర్ల నీటితో కలిపి పంట వేసిన తర్వాాత ఒకసారి పిచికారీ చేస్తున్నారు. రసాయనిక ఎరువుల కన్నా ఇది మంచిగా పనిచేయడంతో పాటు చౌకగా ఉంటుందని చెబుతున్నారు. దిగుబడి పెరిగిందని రైతులు చెబుతున్నారు. నర్మదాపురంలోని నాయకెడకు చెందిన ప్రేంశంకర్ పటేల్ పంట దిగుబడిని పెంచడానికి, కొద్ది మొత్తంలో మద్యాన్ని నీటిలో కలిపి తన పంటపై పిచికారీ చేస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల పంట బాగా పెరుగుతోందని, ఉత్పత్తి పెరుగడంతో పాటు ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.
పురుగుల మందు పిచికారీ చేయాలంటే ఖర్చు ఎకరాకు రూ. 100-150 అవుతుంటే.. దేశీ మద్యం వల్ల రూ.10-12 మాత్రమే ఖర్చు అవుతుందని అక్కడి రైతులు చెబుతున్నారు. బిచువా గ్రామానికి చెందిన ఘాసిరాం మాట్లాడుతూ, ఈ టెక్నిక్ దిగుబడి పరిమాణాన్ని మాత్రమే కాకుండా దాని నాణ్యత కూడా పెరుగుతుందని అన్నారు. కోరోజెన్, అమిడా, అసిడా, థియో వంటి క్రిమిసంహారక మందులు మార్కెట్లో రూ. 1200 నుంచి రూ.1800 వరకు ఉన్నాయి. ఇదే దేశీమద్యం అయితే రూ. 100-150 రేంజులో దొరుకుతుందని.. రైతులు ఎక్కువగా మహావా మద్యాన్ని నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నారు. దీని ధర కేవలం రూ.80 మాత్రమే. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.