Asaduddin Owaisi: హైదరాబాద్ పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ఫైర్ అయ్యారు.
Manipur Violence: జాతుల సంఘర్షణతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. మైయిటీ, కూకీ వర్గాల మధ్య ఘర్షణ కారణంగా ఇప్పటి వరకు 80 మందికి పైగా ప్రజలు మరణించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న మణిపూర్ వెళ్లారు. శాంతి స్థాపన కోసం పలు పార్టీలతో సంభాషించారు. మరోవైపు తిరుగబాటుదారుల ముగుసులో ఉగ్రవాదులు గ్రామాలు, ప్రజలపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మణిపూర్ సరిహద్దును అనుకుని ఉన్న మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వార్తలు వస్తున్నాయి.
Delhi: దేశ రాజధాని ఢిల్లీ తడిసిముద్దవుతోంది. మంగళవారం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుతలో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ఢిల్లీకి రావాల్సిన అనేక విమానాలను దారి మళ్లించారు. మంగళవారం ఢిల్లీకి రావాల్సిన 10 విమానాల్లో 9 విమానాలను జైపూర్ కు, ఒకదాన్ని లక్నోకు దారి మళ్లించారు.
Brij Bhushan Singh: రెజ్లర్లు గంగలో తమ మెడల్స్ పారేస్తామని చెబుతూ హెచ్చరించిన నేపథ్యంలో దీనిపై భారత రెజర్ల సమాఖ్య(WFI) చీఫ్ బ్రిజ్ శరణ్ సింగ్ స్పందించారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల్ని కొట్టిపారేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ శరణ్ ను పదవి నుంచి తీసేసి, అరెస్ట్ చేయాలని మహిళా రెజ్లర్లు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే తమ మెడల్స్ గంగా నదిలో విసిరేస్తామని మంగళవారం రెజ్లర్లు హరిద్వార్ వెళ్లారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం అమెరికా చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ ఎన్నారై శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అమెరికాలోని మూడు నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రవాస భారతీయులతో, అమెరిక్ చట్టసభ సభ్యులతో సమావేశం కానున్నారు.
Pakistan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో ప్రభుత్వం ఉన్నా.. లేని విధంగా తయారైంది అక్కడి పరిస్థితి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రభుత్వం, సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ రోజూ అక్కడ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇదిలా ఉంటే బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రాంతాల్లో వేర్పాటువాదం పెరిగింది. ఇన్ని సమస్యల మధ్య పాకిస్తాన్ బతుకీడుస్తోంది.
North Korea: ఉత్తర కొరియా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గూఢచారి ఉపగ్రహం సముద్రంలో కుప్పకూలింది. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని ఎంతో కీలకంగా భావించారు. జపార్, సౌత్ కొరియాల అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ ప్రయోగం చేపట్టారు. అయితే శాటిలైట్ ప్రయోగ సమయంలో రాకెట్ లో సాంకేతిక లోపం సంభవించింది. దీంతో సముద్రంలో కుప్పకూలిపోయినట్లు ఆదే మీడియా వెల్లడించింది.