Cannes 2023: ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిపోవాలని యావత్ ప్రపంచ సినీఆర్టిస్టులు, మోడల్స్ అనుకుంటారు. అందుకు తగ్గట్లుగానే తన డ్రెస్సింగ్ అదరగొడుతుంటారు. తలతిప్పలేని అందాకలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇది రాజకీయ నిరసనలకు, పలు దేశాలు అవలంభిస్తున్న దమననీతిని ఖండించే వేదికగా మారింది.
Read Also: Tamilanadu: కంటతడి పెట్టిస్తున్న ఘటన.. బిడ్డ శవాన్ని 10 కిమీ మోసుకెళ్లిన తల్లి..
తాజాగా ఇరాన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ఉరిశిక్షలకు వ్యతిరేకంగా ఇరాన్ మోడల్ మహ్లగ్నా జబేరి వినూత్న నిరసన తెలిపింది. మెడకు ఉచ్చుతో, దాని కింద ఉరిశిక్షలను ఆపండి అని కామెంట్స్ తో ఉన్న డ్రెస్ తో కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచింది. ఆమె కాలర్, ఉరికి ఉపయోగించే ఉచ్చు ఆకారంలో, అదే రంగుతో ఉంది. గతేడాది ఇరాన్ మహిళ మహ్సఆమినిని అక్కడి మోరాలిటీ పోలీసులు హిజాబ్ లేదని అరెస్ట్ చేసి దాడి చేశారు. ఆ తరువాత ఆమె చనిపోయింది. దీంతో ఇరాన్ లోని మహిళా లోకం, యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది. మహిళలు ఇరాన్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ.. నిరసన తెలిపారు. ఈ నిరసనల్లో వందలాది మంది చనిపోయారు.
ఇదిలా ఉంటే ఆందోళనలను క్రూరంగా అణిచివేసిన అక్కడి ప్రభుత్వం, ఆందోళనల్లో పాల్గొన్న వారికి వరసగా ఉరిశిక్షలు విధిస్తోంది. ఓ నివేదిక ప్రకారం 2022లో ఇరాన్‌లో మరణశిక్షలు 75% పెరిగాయి. నిరసనకారుల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి ఏకంగా 582 మందిని అక్కడి ప్రభుత్వ చంపేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత వారం ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ.. ఉక్రెయిన్ జెండా రంగులను ధరించిన మహిళ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నిరసన తెలిపింది. రక్తం వంటి కలర్ ను ఒంటిపై పోసుకుని నిరసన వ్యక్తం చేసింది.
Iranian-born model Mahlagha Jaberi arrived to Cannes Film Festival wearing a dress that resembled a noose – to draw attention to awful executions taking place in Iran.
More than 200 people were executed in Iran this year alone.
Another brave woman. Maybe if women were the… pic.twitter.com/K3znZya8o0
— Anton Gerashchenko (@Gerashchenko_en) May 28, 2023