New Parliament Inauguration: భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహత్తర ఘట్టం ప్రారంభం కాబోతోంది. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగ ప్రారంభం కాబోతోంది.
PM Modi: కొత్త పార్లమెంట్ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో కీలక ఉపన్యాసం ఇచ్చారు.
Rahul Gandhi: ప్రధాన మంత్రి కొత్త పార్లమెంట్ ప్రారంభించిన కొద్ది సేపటి తర్వాత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ‘‘ పట్టాభిషేక వేడుక’’లా పరిగణిస్తున్నామని అన్నారు. పార్లమెంట్ ప్రజల గొంతుక అని.. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రధాని పట్టాభిషేకంలా భావిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
ODI World Cup: ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. దీని కోసం బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో ప్రపంచకప్ జరగనుంది. జూన్ 7 నుండి భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత 2023 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి భూకంపం బారిన పడింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10.19 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతం అయింది.
RJD Coffin Remarks: కొత్త పార్లమెంట్ ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం అయింది. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తో పాటు ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, జేడీయూ, ఆప్, వామపక్షాలు వంటి 20 ప్రతిపక్ష పార్టీలు హాజరుకాలేదు. బీఎస్పీ, బీజేడీ, అకాలీదల్, టీడీపీ, వైసీపీ వంటి 25 పార్టీలు హాజరవుతున్నట్లు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరగాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్…
Rajasthan: మద్యపానం చాలా కుటుంబాల్లో నిప్పులు పోస్తోంది. మద్యపానం అలవాటు వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవడమే కాకుండా, ఆత్మహత్యలు, హత్యలకు దారి తీస్తున్నాయి. భార్యభర్తల మధ్య గొడవలకు మధ్యపానం కారణం అవుతోంది. క్షణికావేశం వల్ల కుటుంబాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఇలాంటి గొడవ కారణంగా భర్త సూసైడ్ చేసుకున్నాడు.
New Parliament: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగుతోంది. కొత్త పార్లమెంట్ లో కార్పెట్ చాలా అందంగా ఉండటంతో ఇప్పుడు దానిపై చర్చ మొదలైంది. 900 మంది కార్మికులు ఏకంగా 10 లక్షల పనిగంటల పాటు నేయడం వల్ల ఈ తివాచీలు తయారయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ కళాకారులు ఈ తివాచీ తయారీలో పాలుపంచుకున్నారు. లోక్ సభ, రాజ్య సభ కార్పెట్లపై జాతీయ పక్షి నెమలి, జాతీయ పుష్ఫం కమలం బొమ్మల్ని అద్బుతంగా తీర్చిదిద్దారు.
New Parliament Inauguration: అట్టహాసంగా కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరిగింది. ఉదయం పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన పూజలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు స్పీకర్ ఓంబిర్లా కూర్చున్నారు. ఆ తరువాత అధీనం పూజారుల నుంచి రాజదండం(సెంగోల్)కి సాష్టాంగ నమస్కారం చేసి, ఆ తరువాత దాన్ని స్వీకరించి లోక్ సభ స్పీకర్ పోడియం పక్కన ప్రతిష్టాపించారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య సెంగోల్ ను లోక్‌సభ ఛాంబర్లోని స్పీకర్ కుర్చీకి కుడి వైపున ఉన్న ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో దాన్ని ప్రతిష్టించారు. పార్లమెంట్ నిర్మించిన కార్మికులను సత్కరించారు.
Sand mafia: మహారాష్ట్రలో ఇసుక మాఫియా బరితెగించింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ను హతమర్చే యత్నం చేసింది. ఇసుకతో వెళ్తున్న లారీని ఆపేందుకు యత్నించిన కలెక్టర్ కారును ఢీకొట్టే ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అక్రమంగా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ ను బీడ్ జిల్లా కలెక్టర్ నిలువరించే సమయంలో ఈ ఘటన జరిగింది.