New Payment System: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) పేమెంట్ వ్యవస్థను తీసుకువచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
Maharashtra: ప్రస్తుతం సోషల్ మీడియాలు చిన్నారులపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తెలిసీ తెలియన ప్రాయంలో స్నేహం, లవ్ వంటివి మైనర్లను ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 11 ఏళ్ల బాలికకు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. మాటామాటా కలిపి ఉత్తర్ ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వచ్చేలా సదరు బాలికను నిందితుడైన వ్యక్తి ప్రేరేపించాడు.
Wrestlers Protest: భారత రెజ్లర్ల సమాఖ్య(WFI) చీఫ్, బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు పదవి నుంచి తొలగించాలని రె
Delhi Murder Case: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక సాక్షి హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాహిల్ అనే 20 ఏళ్ల వ్యక్తి అత్యంత క్రూరంగా సాక్షిని 20 కన్నా ఎక్కువ సార్లు పొడిచి, బండరాయితో మోది హత్య చేశారు.
Heart Attacks: ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణాల సంఖ్య పెరుగుతోంది. గతంలో వయసు పైబడినవారికి వచ్చే ఓ జబ్బుగా గుండెపోటు ఉండేది. కానీ ఇప్పుడు యువతలో ముఖ్యంగా టీనేజ్ లో కూడా గుండెపోటు రావడం తద్వారా మరణాలు సంభవించడం చోటు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే గుండెపోటుపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఓ అధ్యయాన్ని నిర్వహించింది. ఇది టాప్ మెడకల్ జర్నల్ అయిన ది లాన్సెట్ లో ప్రచురించబడింది.
India's Defence Exports: భారతదేశం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ గా మారాలని భావిస్తోంది. సొంతంగా ఆయుధాలు, రక్షణ రంగ పరికరాలను తయారు చేసుకుంటోంది. గత కొన్నేళ్ల వరకు భారత్ తన రక్షణ రంగ అవసరాల కోసం ఎక్కువగా రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలపై ఆధారపడుతూ వచ్చింది. అయితే గత కొన్నేళ్లుగా భారత్ సొంతంగానే తయారు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే కాకుండా మనదేశంలో తయారైన రక్షణ పరికరాలను ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది.
Crocodile Attack: ఆస్ట్రేలియా దేశంలో మొసళ్లు, షార్క్ దాడులు తరుచుగా జరుగుతున్నాయి. వీటి బారిన పడిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ రిసార్ట్ లో ఓ వ్యక్తి స్నార్కెలింగ్(ఆక్సిజన్ మాస్క్ తో ఈతకొడుతుండగా) చేస్తుండగా హఠాత్తుగా మొసలి దాడి చేసింది.
Odisha: భార్యపై అనుమానంతో పసిపాప ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు ఓ కసాయి తండ్రి. బిడ్డకు పురుగుమందు ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం పాప ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగింది. పసికందును సోమవారం బాలాసోర్లోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. మంగళవారం వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడంతో కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు జరుపుతున్నట్లు బాలసోర్ ఎస్పీ సాగరిక నాథ్ వెల్లడించారు.