UpComing SUVs:భారతదేశ ఆటోమార్కెట్లో ప్రస్తుతం ఎస్‌యూవీ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. హ్యాచ్ బ్యాక్, సెడాన్ కార్ల కన్నా కూడా కాంపాక్ట్ ఎస్‌యూవీలు, ఎస్‌యూవీల అమ్మకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ ఆటోమేకర్స్ కూడా కొత్త ఎస్‌యూవీ కార్లను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. వచ్చే కొన్ని నెలల్లో వివిధ కంపెనీల నుంచి 5 ఎస్‌యూవీ కార్లు లాంచ్ కాబోతున్నాయి.
వీటిలో మారుతి సుజుకీ జమ్ని, హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా నెక్సాన్ 2023, కియా సెల్టోస్ 2023, హోండా ఎలివేట్ కార్లు ఉన్నాయి.
మారుతి సుజుకీ జిమ్ని:
మారుతి సుజుకీ నుంచి ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ ఉన్న కారుగా జిమ్ని జూన్ మొదటి వారంలో లాంచ్ కాబోతోంది. ఇది మహీంద్రా థార్ కు పోటీగా రాబోతోంది. మహీంద్రా థార్ తో పోలిస్తే జిమ్ని 5 డోర్ వెర్షన్ మరింత మెరుగ్గా ఉండబోతోందని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్:
హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను జూలై 10న విడుదల కానుంది. ఈ వాహనం కోసం బుకింగ్‌లు ఇప్పటికే జరుగుతున్నాయి. టాటా పంచ్ కు పోటీగా ఈ కార్ రాబోతోంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర రూ.6 లక్షల నుంచి రూ. 9.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండవచ్చు.
టాటా నెక్సాన్ 2023:
ఇండియాలో టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో నెంబర్ 1గా ఉన్న నెక్సాన్ తన ఫేస్ లిఫ్ట్ వెర్షన్ తో కొత్తగా రాబోతోంది. ప్రస్తుతం దీని ధర గురించి పెద్దగా తెలియదు. అయితే ప్రస్తుతం ఉన్న నెక్సాన్ ధరలాగే రూ.8 లక్షల నుంచి రూ.14.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
కియా సెల్టోస్ 2023:
సౌత్ కొరియన్ ఆటో మేకర్ కియా తన కొత్త సెల్టోస్ 2023ని తీసుకురాబోతోంది. కియా కంపెనీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ కారుతోనే. ఈ కార్ రావడంతోనే ఎక్కువగా సేల్ అయ్యాయి. ప్రస్తుతం కియాలో సెల్టోస్, సోనెట్ కార్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. కియా సెల్టోస్ 2023 హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి వాటికి పోటీగా కొనసాగుతుంది. ప్రస్తుత వాహనం ధర రూ. 10.89 లక్షల నుండి రూ. 19.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, ఫేస్‌లిఫ్ట్ ప్రీమియంతో వస్తుంది.
హోండా ఎలివేట్:
జూన్ 6న హోండా సరికొత్త ఎలివేట్ మిడ్-సైజ్ SUVని తీసుకువస్తోంది. ఇది పండుగ సీజన్‌కు ముందు విడుదల చేయబడుతుంది. సిటీ మిడ్-సైజ్ సెడాన్ మరియు అమేజ్ కాంపాక్ట్ సెడాన్ తర్వాత భారతీయ మార్కె్ట్ లోకి ఎంట్రీ
ప్రారంభించినప్పుడు, హోండా ఎలివేట్ హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరియు రాబోయే కియా సెల్టోస్ 2023, ఇతర వాటితో పోటీపడుతుంది. దీని ధర రూ. 10.50 లక్షల నుండి రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండవచ్చని అంచనా.