Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిని ‘బిపార్జాయ్’ తుఫాన్ విరుచుకుపడేందుకు సిద్ధం అవతోంది. ఈ నెల 15న గుజరాత్ తీరాన్ని తుఫాన్ తాకే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా తుఫాన్ గుజరాత్ తీరంపై విరుచుకుపడనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. పలు జిల్లాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో చేపలవేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరించారు.
Chikungunya Vaccine: ‘చికున్‌గున్యా’ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలో చాలా మంది ఈ చికున్‌గున్యా జ్వరాల బారినపడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. దోమకాటు ద్వారా ఈ వైరస్ మానవుడిలోకి ప్రవేశించి తీవ్రమైన జ్వరానికి, కాళ్లు, కీళ్ల నొప్పులకు కారణం అవుతుంది. అయితే ఈ జ్వరానికి సంబంధించి లక్షణాలను అనుసరించి ట్రీట్మెంట్ చేసే విధానం మాత్రమే అందుబాటులో ఉంది. కొన్ని రోజుల్లో మానవశరీరం వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేసుకుని, వ్యాధిని నిర్మూలిస్తుంది. అయితే కొన్ని సార్లు ఈ వ్యాధి ప్రాణాంతకంగా…
Unfriendliest Cities: కొత్తవారితో స్నేహం చేయాలనుకుంటున్నారా..? అయితే ముంబై, ఢిల్లీ నగరాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ముంబై, ఢిల్లీ నగరాలు ‘అన్ ఫ్రెండ్లీ సిటీ’ల జాబితాలో నిలిచాయి. కమ్యూనిటీ స్పిరిట్ ఇండెక్స్: వరల్డ్స్ ఫ్రెండ్లీఎస్ట్ సిటీస్ ఫర్ నాన్ నేటివ్స్ ప్రపంచంలోని 53 నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.
బ్రిడ్జ్ పై పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్యాంకర్ లో ఇంధనం ఉండటంతో దాదాపుగా 10 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్ కు అంటుకున్న మంటలు బ్రిడ్జ్ దిగువ భాగం వరకు చేరుకున్నాయి.
RSS: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనుబంధిత ముస్లిం రాష్ట్రీయ మంచ్ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈద్ ఉల్ జుహా(బక్రీద్) సందర్భంగా ఆవులను దానం చేసి సేవించాలని నిర్ణయించినట్లు ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు ఆదివారం
Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. తనపై 40 మందికి పైగా దాడి చేసి, అసభ్యంగా ప్రర్తించారని, అసభ్య పదజాలంతో దూషించారని ఓ ఆర్మీ జవాన్ భార్య ఆదివారం ఆరోపించారు. ఈ ఘటన వేలూరులో జరిగింది. తనను అనుచితంగా తాకినట్లు ఆమె పేర్కొన్నారు. మా కుటుంబాన్ని ప్రశాంతంగా బతకనివ్వమని, బెదిరిస్తున్నట్లు బాధిత మహిళ ఆరోపించారు. శనివారం తనను అర్ధనగ్నంగా చేసి కొట్టారని ఆమె ఆరోపించారు.
Odisha Train Tragedy: ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ సమీపంలోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంతపూర్ రైళ్లు ఢీకొట్టుకున్న ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి కలిగించింది. రైల్వే శాఖ మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ చూడని ఘోరమైన ప్రమాదం జరిగింది.
Tamilisai Soundararajan: శారీరకంగా, మానసికంగా ధృడమైన పిల్లలు పుట్టేందుకు గర్భిణులు ‘సుందర కాండ’ పఠించాలని, ‘రామాయణం’ వంటి పురాణాలు చదవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదివారం అన్నారు. స్వతగా వైద్యురాలు అయిన తమిళసై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ నిర్వహిస్తున్న ‘గర్భ సంస్కార్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సంవర్థినీ న్యాస్ ‘ గర్భ సంస్కార్’ కార్యక్రమం కింద వైద్యులు ‘శాస్త్రీయ, సాంప్రదాయ’ మందుల మిశ్రమాన్ని తల్లులకు అందిస్తారు.
Amit Shah: కాంగ్రెస్, డీఎంకే వంశపారంపర్య రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆదివారం తమిళనాడు చెన్నైలో ఆయన పర్యటించారు. ఈ రెండు పార్టీల అవినీతిని 2G, 3G, 4Gగా అభివర్ణించారు. తమిళనాడులో ఈ పార్టీలను విసిరిపడేసి, ఈ భూమి పుత్రడుికి పట్టం కట్టాలి అని అన్నారు. తొమ్మిదేళ్ల నరేంద్రమోడీ పాలనను ప్రజలకు వివరించేందుకు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.