Vande Bharat Trains: భారత రైల్వేలు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోడీ వరసగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ వందే భారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో 5 వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ జూన్ 26న ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని వీటిని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
No lungi or nighty: గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ తీసుకువచ్చిన డ్రెస్ కోడ్ రూల్స్ వివాదాస్పదం అయ్యాయి. బహిరంగ ప్రదేశాలు, పార్కింగ్ ఏరియాల్లో లుంగీలు కట్టుకుని, నైటీలు ధరించి తిరగొద్దని రూల్స్ జారీ చేసింది. ఈ అపార్ట్మెంట్ ఏరియా గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ 2లో ఉంది.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఒక కారణం అయింది. గత ఆదివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించారు.
Internet Economy: భారతదేశంలో శరవేగంగా డిజిటల్ విప్లవం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలిచిన భారత్, డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఇక రాబోయే కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.
Heat Wave: అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాన్ ‘బిపార్జాయ్’ గుజరాత్ తీరంపై విరుచుకుపడేందుకు చూస్తోంది. రేపు గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. గుజరాత్ తో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ గోవాల రాష్ట్రాలతో పాటు డామన్ డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హావేలీ కేంద్ర పాలిత ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించింది భారతవాతావరణ శాఖ(ఐఎండీ).
Millionaires Migration: భారతదేశం నుంచి మిలియనీర్లు వలస వెళ్లిపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతోంది. ఈ ఏడాది కూడా 6500 మంది మిలియనీర్లు దేశాన్ని వదిలి వెళ్లే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంపద, పెట్టుబడి వలస పోకడలను పరిశీలించే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు 2023 ఈ వివరాలను వెల్లడించింది. ఇలా వేరే దేశాలకు మిలియనీర్లు వలస వెళ్తున్న దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో నిలిచింది. చైనా ఏకంగా 13,500 మంది హై నెట్ వర్త్…
Dog Attack: వీధికుక్కల దాడులు దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఘటనలు నమోదయ్యాయి. వీధికుక్కల దాడుల్లో చిన్నారు, పెద్ద వయసు ఉన్న వారు మరణిస్తున్నారు. వీరే ఈజీగా వాటికి టార్గెట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో నీల్మబూర్ లో మంగళవారం ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఎల్కేజీ చదువుతున్న పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుందగా మూడు వీధికుక్కలు దాడి చేశాయి.
Crocodile Attack: కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. బీహార్ రాష్ట్రంలో 14 ఏళ్ల బాలుడిని ఓ మొసలి చంపి తినేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆ మొసలిని నది నుంచి ఈడ్చుకొచ్చి కసితీరా కర్రలు, రాడ్లతో కొట్టి చంపారు. కొత్త బైక్ కొన్నామనే ఆనందం ఆ కుటుంబంలో ఎంతో సేపు నిలవలేదు. కొత్త బండికి పూజలు చేసేందుకు గంగా నదిలో స్నానం చేసి, గంగా జలాన్ని తీసుకురావాలనుకున్న బాలుడిపై మొసలి దాడి చేసి చంపేసింది.
NEET 2023 Results: మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్(NEET) 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఈ ఏడాది జాతీయ స్థాయిలో టాపర్లుగా నిలిచారు. 99.99 పర్సంటైల్ స్కోర్ తో అగ్రస్థానంలో నిలిచారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మంగళవారం ప్రకటించింది. మొత్తం 20.38 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్షను రాయగా.. 11.45 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
Kerala High Court: సహజీవనంపై కేరళ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్ ని వివాహంగా చట్టం గుర్తించదని హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత, లౌకిక చట్టాల ప్రకారం జరిగే వివాహాలనే చట్టబద్ధ వివాహాలుగా గుర్తిస్తామని చెప్పింది. ఒప్పందం ప్రకారం సహజీవనం చేసే జంట దాన్ని వివాహంగా చెప్పలేరని,