Unfriendliest Cities: “అన్ ఫ్రెండ్లీ” నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unfriendliest Cities: కొత్తవారితో స్నేహం చేయాలనుకుంటున్నారా..? అయితే ముంబై, ఢిల్లీ నగరాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ముంబై, ఢిల్లీ నగరాలు ‘అన్ ఫ్రెండ్లీ సిటీ’ల జాబితాలో నిలిచాయి. కమ్యూనిటీ స్పిరిట్ ఇండెక్స్: వరల్డ్స్ ఫ్రెండ్లీఎస్ట్ సిటీస్ ఫర్ నాన్ నేటివ్స్ ప్రపంచంలోని 53 నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. స్థానికేతరుల పట్ల ఆ సిటీల్లోని ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశాలపై ఈ నివేదిక వెల్లడైంది. ఆరు కీలక కొలమానాల ఆధారంగా పలు సిటీలకు స్కోర్ కేటాయించారు. సందర్శకులు తిరిగి రావడం, భద్రతా రేటింగ్స్, LGBTQ+ సమానత్వం, ఓవర్ ఆల్ హ్యాపీనెస్, సాధారణ భాష, సిబ్బంది స్నేహపూర్వకంగా(ఫ్రెండ్లీ స్టాఫ్) వ్యవహరించే తీరు అంశాల ఆధారంగా సర్వే నిర్వహిచారు.
ఫ్రెండ్లీ సిటీల జాబితాలో ఒక్క భారతీయ నగరం కూడా చోటు సంపాదించుకోలేదు. ముంబై, ఢిల్లీ మాత్రం అన్ ఫ్రెండ్లీ సిటీల జాబితాలో చేరాయి. ఆఫ్రికా దేశం ఘనా రాజధాని అక్రా స్థానికేతరులతో అత్యంత తక్కవ స్నేహపూర్వక నగరంగా నిలిచింది. మొత్తం 10 పాయింట్లకు అక్రాకు కేవలం 3.12 స్కోర్ లభించింది. మెరాకోలోని మర్రకేజ్ 3.62 స్కోర్ తో రెండో స్థానంలో ఉంది. ముంబయి, కౌలాలంపూర్, రియో డి జెనీరో, ఢిల్లీలు అన్‌ఫ్రెండ్లీ జాబితాలో ఆ తర్వాత స్థానాలను ఆక్రమించాయి.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
Read Also: Balayya : బాలయ్య తో శ్రీదేవి నటించకపోవడానికి కారణం అదేనా..?
మరోవైపు ప్రపంచంలో ఫ్రెండ్లీగా ఉండే నగరాల జాబితాలో కెనడా నగరం టొరంటో, ఆస్ట్రేలియా నగరం సిడ్నీలు స్థానికేతరులతో చాలా స్నేహపూర్వకంగా ఉన్నట్లు తేలాయి. రెండూ 10కి 7.97తో స్కోర్ సాధించాయి. ఈ రెండు కూడా ఫ్రెండ్లీ నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాయి. ఎడిన్ బర్గ్, మాంచెస్టర్ రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. 100కి 68.92 సేఫ్టీ ఇండెక్స్ స్కోర్‌తో 7.78 అత్యధిక స్నేహపూర్వక స్కోర్ సాధించింది. మాంచెస్టర్ 10కి 7.72 స్కోర్ చేసింది. స్నేహితులను ఎలా సంపాదించుకోవాలనే సెర్చ్ చేసిన నగరాల జాబితాలో బ్రెజిల్ లోని సావోపాలో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. న్యూయార్క్, పారిస్ నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇక భారతదేశంలోని ముంబై, ఢిల్లీ నగరాల విషయానికి వస్తే కేవలం 12 శాతం మాత్రమే ముంబై స్నేహపూర్వకంగా ఉంటుందని భావించారు. ఢిల్లీ 17 శాతం మాత్రమే ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపారు. ఫ్రెండ్లీ స్టాఫ్ కేటగిరీ కింద సర్వే ప్రకారం, ముంబై 3.91% రేటింగ్‌ను సాధించగా, ఢిల్లీ 3.27% సాధించింది. హ్యాపీనెస్ స్కోర్ లో ముంబై 3.78 స్కోర్ సాధించగా, ఢిల్లీ 4.01 స్కోర్ సాధించింది.
తాజావార్తలు
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!