Air India: మళ్లీ అదే తప్పు చేసిన ఎయిరిండియా పైలట్లు.. నెలల వ్యవధిలో రెండో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: దేశీయ దిగ్గజ ఎయిర్ లైనర్ ‘ఎయిరిండియా’ పదేపదే అభాసుపాలవుతోంది. గత కొన్ని నెలలులగా ఎయిరిండియా వివాదాల్లో నిలుస్తోంది. తాజాగా మరో వివాదంతో మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్ని నెలల క్రితం ఎయిరిండియా పైలట్లు ఒక మహిళ స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించారు. ప్రయాణం మొత్తం కూడా ఆమె కాక్‌పిట్‌లోనే ఉంది. ఈ ఘటన చర్చనీయాంశం కావడంతో డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిరిండియాను వివరణ అడిగింది. కాక్‌పిట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డీజీసీఏ ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించడంతో పాటు పైలట్లను సస్పెండ్ చేసింది.
Read Also: Bank Jobs: బ్యాంకులో కొలువుల జాతర.. దరఖాస్తులకు ఒక్కరోజే గడువు..
Also Read
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. గత వారం ఢిల్లీ-లేహ్ విమానం AI-445 కాక్‌పిట్‌లోకి ఒక మహిళను పైలట్లు అనుమతించారు. ప్రస్తుతం పైలట్లపై క్యాబిన్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఎయిరిండియా చర్యలు ప్రారంభించింది. విమానం కాక్‌పిట్‌లోకి మహిళను అనుమతించినందుకు ఇద్దరు పైలట్లను గ్రౌండ్/ఆఫ్-రోస్టర్ చేసినట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి వెల్లడించారు. డీజీసీఏకి ఈ విషయం తెలుసునని, విధివిధానాలకు అనుగుణంగా ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దర్యాప్తు కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కొన్ని నెలల క్రితం ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్-ఢిల్లీ విమానంలో కాక్‌పిట్‌లోకి మహిళా స్నేహితురాలిని అనుమతించిన పైలట్లపై డీజీసీఏ నిబంధలనకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. మహిళా స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించిన ఎయిర్ ఇండియా పైలట్ లైసెన్స్‌ను డీజీసీఏ సస్పెండ్ చేసింది. కాక్‌పిట్ ఉల్లంఘన కేసులో సత్వర, సమర్థవంతమైన చర్యను ప్రారంభించడంలో వైఫల్యం చెందిందనే ఆరోపణలతో విమానయాన నియంత్రణ సంస్థ విమానయాన సంస్థపై రూ.30 లక్షల జరిమానా విధించింది.
తాజావార్తలు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?