Greece: వలసదారులతో వెళ్తున్న పడవ మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. గ్రీస్ తీరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో 78 మంది మరణించారు. చాలా మంది గల్లంతయ్యారు. పెలోపొన్నీస్ తీరానికి సమీపంలోని పైలోస్ పట్టణానికి నైరుతి దిశలో 87 కిలోమీటర్లు దూరంలో అంతర్జాతీయ జలాల్లో పడవ బోల్తా పడిందని గ్రీక్ కోస్ట్‌గార్డ్ తెలిపింది.
Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. సీఎం స్టాలిన్ క్యాబినెట్ మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. అధికార డీఎంకే పార్టీ ఈడీ రైడ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా డీఎంకేకు మద్దతు పలుకుతున్నాయి.
YouTube: కంటెంట్ క్రియేటర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ గుడ్ న్యూస్ చెప్పింది. మానిటైజేషన్‌కు అర్హత సాధించేందుకు ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది.
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పురోలా, ఉత్తరకాశీ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఎప్పుడు ఏ పరిస్థితి ముంచుకొస్తుందో తెలియడం లేదు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఈ నెల 15న మహాపంచాయత్ కు పిలుపునిచ్చాయి. అయితే ఉత్తరకాశీ యంత్రాంతగా ఇందుకు బుధవారం అనుమతి నిరాకరించింది. మహాపంచాయత్ సమయంలో పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో అధికారులు అనుమతి నిరాకరించారు. పురోలా ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
Human Sacrifice: కన్నబిడ్డగా చూసుకోవాల్సిన సవితి తల్లే బాలుడి పట్ల దారుణంగా వ్యవహరించింది. తన ఆరోగ్య సమస్యలు తగ్గిపోవడానికి ఓ క్షుద్రపూజారి చెప్పిన విధంగా నాలుగేళ్ల బాలుడిని బలిచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమేథిలోని జామో ప్రాంతంలోని రెహ్సీ అనే గ్రామంలో జరిగింది.
Bihar: అత్తామామ తీరుతో విసుగు చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. పెళ్లై నెల రోజులైనా భార్యను తనతో పంపించేందుకు అత్తామామలు అడ్డుచెబుతుండటంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్ ధన్గోన్వా గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ గుప్తా నెల రోజుల క్రితం ఏప్రిల్ 14న ఎక్వారి గ్రామానికి చెందిన రీమా కుమారిని వివాహం చేసుకున్నాడు.
Earthquake: గుజరాత్ కచ్ ప్రాంతంలో ఈ రోజు భూకంపం సంభవించింది. కచ్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రంతో భూకంపం వచ్చింది. వరసగా రెండు రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి.
Ukraine War: ఏడాదిన్నరగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, అమెరికా ఆంక్షలకు భయపడకుండా పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు.