Largest Kidney Stone: సాధారణంగా కిడ్నీలో చిన్నచిన్న సైజులో రాళ్లు ఉంటాయి. అయితే ఇవి చాలా వరకు వాటంతట అవే శరీరం నుంచి వెళ్లిపోతుంటాయి. అరుదుగా కొన్ని సందర్భాల్లో సర్జరీ చేయాల్సి ఉంటుంది. మహా అయితే అవి 5 సెంటీమీటర్ల పరిమాణం కన్నా తక్కువగానే ఉంటాయి. అయితే శ్రీలంకలో మాత్రం ఓ వ్యక్తి కిడ్నీలో ఏకంగా 13.372 సెం.మీ (5.264 అంగుళాలు) పరిమాణంలో 801 గ్రాములు ఉన్న ఓ కిడ్నీస్టోన్ ను తొలగించారు. ఇది కిడ్నీలో చిన్న రాయి కాదు పెద్ద బండ మాదిరిగా ఉంది.
Read Also: Vande Bharat Trains: ఒకే రోజు 5 వందే భారత్ ట్రైన్స్ ప్రారంభం.. ఏయే రూట్లలో తెలుసా..?
ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద కిడ్నీ స్టోన్ ఇదే అని కొలంబోలోని ఆర్మీ హస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో బాధిత వ్యక్తి కిడ్నీ నుంచి ఈ రాయిని తొలగించారు వైద్యులు. ప్రపంచంలో అతి పెద్ద కిడ్నీ స్టోన్ గా ఇది రికార్డులకెక్కింది. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. చివరిసారిగా 2004లో భారత దేశంలో 13 సెంటీమీటర్ల కిడ్నీ స్టోన్ పేరిట రికార్డు ఉండేది. ప్రస్తుతం ఈ రికార్డ్ బద్దలైంది. అంతకుముందు పాకిస్తాన్ లో అత్యంత బరువు 620 గ్రాములు ఉన్న కిడ్నీ స్టోన్ పాకిస్తాన్ లో నమోదైంది.
కన్సల్టెంట్ యూరాలజిస్ట్ లెఫ్టినెంట్ కల్నల్ (డా) కె. సుదర్శన్, హాస్పిటల్‌లోని జెనిటో యూరినరీ యూనిట్ హెడ్, కెప్టెన్ (డా) W.P.S.C పతిరత్న, డాక్టర్ థమాషా ప్రేమతిలకతో కలిసి శస్త్రచికిత్సకు నాయకత్వం వహించారు. కల్నల్ (డా) U.A.L.D పెరెరా, కల్నల్ (Dr) C.S అబేసింగ్ కూడా శస్త్రచికిత్స సమయంలో కన్సల్టెంట్ అనస్తీటిస్టులుగా సహకరించారని శ్రీలంక ఆర్మీ ప్రకటన తెలిపింది.