Bihar: అత్తామామ తీరుతో విసుగు చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. పెళ్లై నెల రోజులైనా భార్యను తనతో పంపించేందుకు అత్తామామలు అడ్డుచెబుతుండటంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్ ధన్‌గోన్వా గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ గుప్తా నెల రోజుల క్రితం ఏప్రిల్ 14న ఎక్వారి గ్రామానికి చెందిన రీమా కుమారిని వివాహం చేసుకున్నాడు.
Read Also: Defamation case: రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు కోర్టు సమన్లు..
కృష్ణ కుమార్ గుప్తా తన కుటుంబంతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నాడు. అయితే పెళ్లైన తర్వాత అతని భార్య, తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. శుభ గడియలు, మంచి రోజులు లేవని కృష్ణ కుమార్ గుప్తా అత్తామామలు, భార్య రీమాకుమారిని పంపేందుకు వాయిదా వేస్తున్నారు. దీంతో కృష్ణకుమార్ కుటుంబం మొత్తం ముంబైకి వెళ్లిపోయింది. దాదాపుగా రెండు నెలల తర్వాత కృష్ణకుమార్ తన భార్యతను తీసుకెళ్లడానికి బీహార్ వచ్చాడు. అయితే మరోసారి అతని అత్తామామఅలు మంచి రోజులు లేవని మరోసారి రీమాకుమారిని పంపేందుకు ససేమిరా అన్నారు.
దీంతో మనస్తాపానికి గురైన కృష్ణ సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను పదిరోజుల క్రితం బీహార్ వచ్చాడని, తన భార్యను పంపించేందుకు అత్తమామలు నిరాకరించడంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసు స్టేషన్‌లో మృతుడి బంధువులు ఎవరిపైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని ఇన్‌ఛార్జ్ అధికారి పూజా కుమారి తెలిపారు. పోలీసులు సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేసి, ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.