Cyclone Biparjoy: గుజరాత్ తీరాన్ని ముంచెత్తడానికి ‘బిపార్జాయ్’ తుఫాన్ ముంచుకొస్తుంది. మరికొన్ని గంటల్లలో గుజరాత్ తీరాన్ని తాకనుంది. ఇదిలా ఉంటే తుఫాన్ వస్తుందనే ముంచుకొస్తుందనే సూచనలు వెలువడుతున్నాయి.
The Earth: భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని గంటలు పడుతుందంటే అంతా చటుక్కున 24 గంటలు అని చెప్తారు. ఈ 24 గంటలనే మనం ఒక రోజుగా పరిగణిస్తున్నాము. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని మిల్లిసెకన్ల మేర హెచ్చు తగ్గులు నమోదు అవుతుంటాయి. ఇది కూడా చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అయితే కొన్ని మిలియన్ ఏళ్లకు క్రితం భూమిపై ఒక రోజు అంటే 19 గంటలు మాత్రమేనట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విపక్షాల ఐక్యత గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడకుంటే.. తర్వాత భారతదేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని ఆప్ గురువారం ఆరోపించింది.
Amazon Prime Lite: అమెజాన్ ప్రైమ్ భారతదేశంలో తన బేస్ విస్తరించేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ‘అమెజాన్ ప్రైమ్ లైట్’ని తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించింది. రెగ్యులర్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వలే కాకుండా తక్కువ ధరకే లైట్ సభ్యత్వాన్ని కల్పిస్తోంది.
Karnataka: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీజేపీ తీసుకువచ్చిన అన్ని చట్టాలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకువచ్చని మతమార్పిడి నిరోధక చట్టాన్ని గురువారం కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.
Edible oil prices: ధరలతో అల్లాడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ముఖ్యంగా సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5కి తగ్గించింది ప్రభుత్వం.
US Predator drone Deal: అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల(MQ-9B సీగార్డియన్ డ్రోన్) కొనుగోలు ఒప్పందానికి భారత రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) గురువారం ఈ ఒప్పందానికి ఓకే చెప్పింది. అయితే ఈ కొనుగోలుకు ప్రక్రియకు ముందు ఈ డీన్ ను భద్రతకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
Vande Bharat Train: తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ట్రైన్ రాబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ నడుస్తోంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది భారత రైల్వే. సికింద్రాబాద్-నాగ్ పూర్ మధ్య వందేభారత్ రైలు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే ఈ రూట్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి. సాధారణ కార్యకలాపాలకు అనువుగా ఉందని రైల్వే శాఖ నిర్థారణకు వచ్చింది.