YouTube: కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నా చాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTube: కంటెంట్ క్రియేటర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ గుడ్ న్యూస్ చెప్పింది. మానిటైజేషన్‌కు అర్హత సాధించేందుకు ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. యూట్యూబ్ పార్ట్నర్ పోగ్రామ్ నిబంధనలను సవరించింది. తక్కువ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లు కూడా డబ్బులు సంపాదించేందుకు నిబంధనలను మార్చింది. గతంలో యూట్యూబ్ మానిటైజేషన్ అర్హత సాధించాంటంటే కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండటంతో పాటు ఏడాదిలో కనీసం 4000 గంటల వ్యూస్ ఉండాలి, లేదా 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్స్ వీడియో వ్యూస్ ఉండాలి.
Read Also: Minister KTR : ప్రస్తుత పరిస్థితుల్లో విద్య, వైద్యంపైనే ఎక్కువ ఖర్చు అవుతుంది
Also Read
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
అయితే కొత్తగా తీసుకువచ్చిన మానిటైజేషన్ నిబంధనల ప్రకారం.. ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నా సరిపోతుంది. చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకన్నా ఎక్కువ పబ్లిక్ వీడియోలను అప్లోడ్ చేసి ఉండాలి, ఏడాదిలో 3000 గంటల వ్యూస్ లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఈ కనీస అర్హతలు సాధించిన కంటెంట్ క్రియేటర్లు ఇకపై యూట్యబ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ కి అప్లయ్ చేసుకోవచ్చు.
ముందుగా ఈ నిబంధనలను అమెరికా, బ్రిటన్, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాలో యూట్యూబ్ తీసుకువస్తోంది. మిగతా దేశాల్లో ఆ తరువాత అమలు చేయనుంది. భారత్ లో ఎప్పుడు తీసుకురాబోతున్నామనే వివరాలను యూట్యూబ్ వెల్లడించలేదు. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం యూట్యూబ్ లో చిన్న కంటెంట్ క్రియేటర్లు కూడా డబ్బులు సంపాదించే వెసులుబాటు కలిగింది. సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ వంట టిప్పింగ్ టూల్స్ తో పాటు ఛానెల్ మెంబర్ షిప్స్ వంటి సబ్‌స్క్రిప్షన్ టూల్స్ ను పొందేందుకు వీలు కలుగుతుంది.
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!