Venu Goapl Reddy
Author- NTV Telugu-
Earthquake: ఒకే రోజు రెండు ప్రాంతాల్లో.. కార్గిల్, మేఘాలయాల్లో భూకంపాలు..
Earthquake: దేశంలో ఒకే రోజు రెండు ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి. లడఖ్‌లోని కార్గిల్‌లో ఈ రోజు మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. మధ్యాహ్నం 2.42 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. -
Candida Auris: అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్..
Candida Auris: అగ్రరాజ్యం అమెరికాను ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ భయపెడుతోంది. క్యాండిడా ఆరిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ అక్కడ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే వాషింగ్టన్ రాష్ట్రంలో ఈ నెలలో నలుగురు వ్యక్తులకు ఈ ఫంగస్ సోకింది. అత్యంత అరుదైన, ప్రాణాంతక ఇన్ఫెక్షన్ అని, దీని వల్ల అధిక మరణాల రేటు కలిగి ఉండటంతో పాటు డ్రగ్ రెసిస్టెంట్ కలిగి ఉండీ, సులభంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
Worst Traffic: భారత్‌లో ఈ నగరాల్లోనే “వరస్ట్ ట్రాఫిక్”.. వరల్డ్‌లో లండన్‌కి ఫస్ట్ ప్లేస్..
Worst Traffic: భారతదేశ నగరాల్లో ఇటీవల కాలంలో ట్రాఫిక్ కష్టాలు పెరగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆమ్స్టర్డామ్కు చెందిన లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్‌టామ్ నివేదిక ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ ఉన్న నగరాల జాబితాను వెల్లడించింది. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఆరు ఖండాల్లోని 55 దేశాల్లోని 387 నగరాలను, వాటి సగటు ప్రయాణ సమయం, -
Asaduddin Owaisi: “భార్యపై కోపం పౌరుషం అనిపించుకోదు”.. ఇల్లాలితో ఎలా మెలగాలో చెప్పిన ఓవైసీ..
Asaduddin Owaisi: ఇల్లాలిలో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని వివరంగా చెప్పారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. భార్యపై కోపం వెళ్లగక్కడం పౌరుషం అనిపించుకోదని, ఆమె కోపాన్ని తట్టుకోవడమే నిజమైన పౌరుషం అని అన్నారు. పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భార్యలతో మగవారు మంచిగా నడుచుకోవాలని అన్నారు. ‘‘నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. ఇది చాలా మందిని కలవరపెట్టింది. మీ భార్య మీ బట్టలు ఉతకాలి, -
British MP: “రామమందిరంపై పక్షపాతం”.. బీబీసీ తీరుపై బ్రిటిష్ ఎంపీ ధ్వజం..
British MP: అయోధ్య రామ మందిరంపై బీబీసీ పక్షపాత కవరేజ్‌పై బ్రిటిష్ ఎంపీ బాబా బ్లాక్‌మన్ ధ్వజమెత్తాడు. జనవరి 22న జరిగిన అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన వేడుకలకు సంబంధించి బీబీసీ తీరు సరిగా లేదని అన్నారు. బీబీసీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో దానికి తగిన రికార్డుల్ని అందించాలని అన్నారు. యూకే పార్లమెంట్లో మాట్లాడిన బాబ్ బ్యాక్మన్.. 2000 ఏళ్లకు పైగా దేవాలయం ఉన్న విషయాన్ని మరిచిపోయి, మసీదు ధ్వంసం చేసిన ప్రదేశం అంటూ అయోధ్య రామ మందిరం గురించి బీబీసీ నివేదించిందని అన్నారు. -
Arvind Kejriwal: “నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు”.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని బలవంతం చేస్తు్న్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయినా కూడా తాను ఒత్తిళ్లకు లొంగబోనని తేల్చి చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కేసును ఢిల్లీ క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్‌కి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విచారణ మధ్యే కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. -
Jairam Ramesh: 2002లో నరేంద్రమోడీని అద్వానీ కాపాడారు..
Jairam Ramesh: బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. ప్రధాని మోడీ, ఎల్కే అద్వానీకి సంబంధించి రెండు సంఘటనల గురించి ఆయన మాట్లాడారు. 2002లో నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అద్వానీ, ఆయనను కాపాడారని, ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మోదీని సీఎం పదవి నుంచి తప్పించాలనుకున్నారని, వాజ్‌పేయి మోడీకి రాజధర్మాన్ని గుర్తు చేశారని జైరాం రమేష్ అన్నారు. ఆ సమయంలో ఎల్కే అద్వానీ నరేంద్రమోడీకి అండగా నిలిచారని చెప్పారు. -
Ramleela play: సీతాదేవీ సిగరేట్ తాగుతున్నట్లుగా నాటక ప్రదర్శన.. ప్రొఫెసర్, విద్యార్థుల అరెస్ట్..
Ramleela play: రామయాణం ఇతిహాసం ఆధారంగా నాటకాన్ని ప్రదర్శిస్తూ.. అందులో పవిత్ర దేవీదేవతలను కించపరుస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు పూణే యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్, ఐదుగురు విద్యార్థులను శనివారం అరెస్ట్ చేశారు. నాటకంలో అసభ్యకరమైన సీన్లు, డైలాగ్స్ ఉన్నాయని, ఇందులో సీతాదేవీ పాత్రధారి సిగరేట్ తాగుతున్నట్లు చూపించారని ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ కార్యకర్త హర్షవర్థన్ హర్పుడే ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 (A) మరియు ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
Ashok Gehlot: మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌కి కోవిడ్, స్వైన్ ఫ్లూ.. ఆస్పత్రిలో చేరిక..
Ashok Gehlot: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కోవిడ్-19, స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. జ్వరం, తక్కువ ఆక్సిజన్ సాచురేషన్ స్థాయిలు ఉండటంతో జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అచల్ శర్మ శనివారం చెప్పారు. -
BJP MP: రాహుల్ గాంధీ బంగ్లా చొరబాటుదారుల్ని ఏకం చేస్తూ.. హిందువులకు అన్యాయం చేస్తున్నాడు..
BJP MP: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తన పాదయాత్ర ద్వారా బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లను ఏకం చేస్తున్నారని, హిందువులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆయన యాత్రలో ముస్లింలు అందరూ పాల్గొంటున్నారని, దానికి సంబంధించిన వీడియో రుజువు తన వద్ద ఉందంటూ చెప్పారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!