Naxals Audition for Movie: నక్సలైట్స్, మావోయిస్టుల నేపథ్యంలో దేశంలో పలు భాషల్లో సినిమాలు వచ్చాయి. టాలీవుడ్ లో కూడా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు నిర్మించారు. పల్లెల్లో పరిస్థితులు, ఫ్యూడల్ వ్యవస్థ, ఆ సమయంలో పోలీసుల అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. యాక్టర్లు నక్సలైట్ పాత్రల్ని పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నిజమైన నక్సలైట్లు సినిమాల్లోకి రాబోతోతున్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు సినిమా ఆడిషన్ కూడా నిర్వహించారు.
వివరాాల్లోకి వెళ్తే దేశంలో ఎక్కువగా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఒకటి. ఇక్కడి పోలీసులు లొంగిపోయిన నక్సలైట్లకు జీవనోపాధి కల్పిస్తున్నారు. తాజా వారిని సినిమా రంగంలోకి వెళ్లేలా ప్రోత్సహిస్తున్నాు. ప్రముఖ మరాఠీ నటి తృప్తి భోయిర్, నిర్మాత విశాల్ కపూర్ గడ్చిరోలి జిల్లాలోని గిరిజన సంప్రదాయాల ఆధారంగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. దీని కోసం లొంగిపోయిన నక్సలైట్లను ఈ సినిమాలో నటించేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ఆడిషన్ ఇటీవల జరిగింది. రాష్ట్ర పోలీసుల చొరవతో శనివారం వారంతా సినిమా పాత్రల కోసం ఆడిషన్ లో పాల్గొన్నారు.
Read Also: Rs. 2000 note withdrawal: బ్యాంకులకు చేరిన 72 శాతం రూ.2000 నోట్లు..
గిరిజనులు అధికంగా ఉండే గడ్చిరోలి జిల్లాలో రుతుక్రమం సమయంలో స్త్రీలు ఇంటికి బయట నిర్మించిన కుర్మఘర్ అని పిలుబడే గుడిసెలో ఉండాలనే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం పేరు పైనే సినిమాకు కుర్మాఘర్ అని పేరు పెట్టారు. గడ్చిరోలి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలోని నవజీవన్ కాలనీలో జరిగిన ఈ ఆడిషన్‌కు పురుషులు, మహిళలు హాజరయ్యారు. హాజరైన వారికి తృప్తి భోయిర్ మరియు విశాల్ కపూర్ ద్వారా వాయిస్ మాడ్యులేషన్ మరియు నటనలో శిక్షణ కూడా ఇచ్చారు.
భవిష్యత్తులో లొంగిపోయిన నక్సల్స్‌కు సినిమాల్లో నటించే అవకాశం కల్పించడంతోపాటు నటనలో తమ కెరీర్‌ను చక్కదిద్దుకునేందుకు ఈ చొరవ తీసుకోవడం జరిగిందని, ఇది తమకంటూ ఒక కొత్త గుర్తింపును ఏర్పరచుకోవడంలో దోహదపడుతుందని గడ్చిరోలి జిల్లా నీలోత్పాల్ అన్నారు. ఇంతకుముందు తృప్తి భోయిర్, విశాల్ కపూర్, తుజ్యా మాజ్యా సంసారాల, కయే హావ్, టూరింగ్ టాకిస్ వంటి చాలా ప్రశంసలు అందుకున్న మరాఠీ చిత్రాల్లో పనిచేశారు.