iPhone: భారతదేశంలోని ఐఫోన్ యూజర్లకు ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. వెంటనే ఫోన్ అప్డేట్ చేయలని సలహా ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) భారతదేశంలోని ఐఫోన్ వినియోగదారులకు భద్రతా హెచ్చరికను జారీ చేసింది.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఆశ్చర్యకర దృశ్యం ఆవిష్క్రతమైంది. ప్రఖ్యాత హాలీవుడు సింగర్, నటి మేరీ మిల్బెన్ ప్రధాని పాదాలకు నమస్కరించారు.
Manipur Violence: నెల రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణ తీవ్ర హింసకు దారి తీసింది. సైన్యం, సీఆర్పీఎస్ బలగాలు రాష్ట్రంలో మోహరించినా పరిస్థితి చక్కబడటం లేదు.
Russia: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు యుద్ధంలో రష్యా తరుపును పోరాడిన వాగ్నర్ కిరాయి సైన్యం ఇప్పుడు అధ్యక్షుడు పుతిన్‌కి ఎదురుతిరుగుతోంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముగిసింది. మూడు రోజలు పాటు ఈయన అమెరికాలో బిజీబీజీగా పర్యటించారు. ఈ రోజు ఆయన ఈజిప్టు పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పాటు ఆయన ఈజిప్టులో పర్యటించనున్నారు. 1997 తర్వాత తొలిసారిగా భారత ప్రధాని ఈజిప్టు పర్యటనకు వెళ్తున్నారు.
El Nino: ప్రపంచం ఇప్పుడిప్పుడే కోవిడ్ బారి నుంచి కోలుకుంటోంది. పాండమిక్ దశ నుంచి ఎండమిక్ దశకు చేరుకుంది. దీంతో అన్ని దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే రానున్న రోజుల్లో మరింతగా వైరస్లు విజృంభించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే దీనికి కారణం ఎల్ నినో అనే వాతావరణ పరిస్థితి అని తెలిపింది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఎల్ నినో తిరిగి రావడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణం, ఆర్థిక క్షీణత, వ్యవసాయం పై ప్రభావం ఉండే అవకాశం ఉంది.
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లో తన రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. కాశ్మీర్లో డెవలప్మెంట్ గురించి ఆయన ప్రస్తావించారు. బీజేపీ సిద్ధాంతకర్త, భారతీయ జన సంఘం వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. సాంబాలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ లాబొరేటరీకి శంకుస్థాపన చేసిన తర్వాత సాయంత్రం శ్రీనగర్‌కు వెళ్లి అక్కడ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించే వితస్తా ఫెస్టివల్లో పాల్గొని అనంతరం భద్రతా సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.