Rahul Gandhi: పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్న విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. పాట్నా చేరుకున్న వీరిద్దరు అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధిస్తామని.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ కనిపించకుండా చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్ నిలబడుతోందని.. ఇద్దరుముగ్గురు కోసమే బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు.
Titan: యావత్ ప్రపంచాన్ని ‘టైటాన్’ ప్రమాదం కలవరపరిచింది. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శిథిలాలు చూసేందుకు వెళ్తున్న క్రమంలో టైటాన్ సబ్ మెర్సిబుల్ ప్రమాదానికి గురైంది.
Titan Tragedy: అట్లాంటిక్ సముద్రంలో మునిపోయిన టైటానిక్ షిప్ ను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో బయలుదేరిన ‘టైటాన్’ సబ్మెర్సిబుల్ ప్రమాదానికి గురైంది. సముద్రం అడుగు భాగంలో 4 కిలోమీటర్ల లోతులో పేలిపోయింది. ఈ ప్రమాదంలో పాకిస్తానీ బిజినెస్‌మ్యాన్ కూడా చనిపోయాడు. పాకిస్తానీ - బ్రిటిష్ ధనవంతుడు షాహజాదా దావూద్, అతని కుమారుడు 19 ఏళ్ల సులేమాన్ దావూద్ మరణించిన ఐదుగురిలో ఉన్నారు.
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇప్పుడు టెక్ ప్రపంచం అంతా దీని చుట్టే తిరుగుతోంది. రానున్న కాలంలో మానవుడి మనుగడ మరింత స్మార్ట్ కావడానికి ఏఐ కీలకంగా మారుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ కంపెనీలు ఏఐ మీద దృష్టి పెట్టి కొట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నాయి.
Encounter: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(POJK) నుంచి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఎన్కౌంటర్ లో హతమయ్యారు.
Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాదుల్లో భయం పట్టింది. 45 రోజలు వ్యవధిలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల్లో హతమయ్యారు. దీంతో మిగతా ఖలిస్తానీ వేర్పాటువాదులు గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. ఖలిస్తానీల్లో కీలకమైన గురుపత్వంత్ సింగ్ పన్నూ గత కొంతకాలంగా కనిపించడం లేదు.
Micron: భారతదేశంలో చిప్ ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు సెమికండక్టర్స్ తయారీ దిగ్గజం మైక్రాన్ ప్రకటించింది. గుజరాత్ లో 825 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 6,760 కోట్లు) పెట్టుబడితో ఈ ప్యాక్టరీ నెలకొల్పనున్నట్లు నిర్దారించింది. 2023లోనే మైక్రాన్ ఫ్యాక్టరీ నెలకొల్పే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది.